YES BANK ఖాతాదారులకు ఊరట..సేవలు పునరుద్ధరణ

  • Published By: madhu ,Published On : March 16, 2020 / 07:41 AM IST
YES BANK ఖాతాదారులకు ఊరట..సేవలు పునరుద్ధరణ

బ్యాంకులో ఉన్న డబ్బులు ఏమవుతాయో ఏమో..బ్యాంకు విధించిన ఆంక్షల నడుమ డబ్బులు తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాం..తాము కష్టపడి సంపాదించని సొమ్ము తమకు చేతికి అందుతుందా అని ఎంతోమంది YES Bank ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

ఎందుకంటే ఈ బ్యాంకు సంక్షోభంలో కూరుపోయింది. మార్చి 5వ తేదీన యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన సంగతి తెలిసిందే. అయితే..వీరందరూ ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2020, మార్చి 18వ తేదీ నుంచి YES Bank సేవలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Also Read | ప్రభుత్వం నోటీసులు పంపే వరకు పార్కులు, గార్డెన్స్ బంద్

* యెస్ బ్యాంకులో నెలకొన్న సంక్షోభం బ్యాంకింగ్ రంగాన్ని ఒక కుదుపుకుదిపింది. బోర్డును రద్దు చేయడంతో అందులో ఉన్న ఖాతాదారులు, డిపాజిట్ చేసిన వారందరూ షాక్ అయ్యారు. 
* ఈ ఎపిసోడ్ అంతటికీ రాణా కపూర్ కేంద్ర బిందువుగా మారారు. 
* యెస్ బ్యాంక్ సంక్షోభంలో అసలు దోషుల బెండు తీసేందుకు ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. 

* ఇప్పటికే  బ్యాంక్ వ్యవస్థాపకుడైన రాణాకపూర్‌ని అదుపులోకి తీసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌. 
* బ్యాంక్‌ని ముంచి రాణాకపూర్ ఎన్ని వేల కోట్ల సొమ్ము మింగేశాడో తెలుసుకునే పనిలో పడింది ఈడీ. 
* ప్రధానంగా గత ఏడాది దివాళా తీసిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ DHFLకు యెస్‌ బ్యాంక్‌ రూ. 3700 కోట్లు రుణం ఇవ్వగా ఇవన్నీ మొండిబకాయిలుగా మారిపోయాయి. 

* ఈ ఒక్క కంపెనీ నుంచే రాణాకపూర్ ఫ్యామిలీకి రూ. 600 కోట్లు ముడుపుల రూపంలో ముట్టినట్లు ఈడీ తేల్చింది. 
* ఇంకా DHFL తరహాలోనే..చాలా కార్పొరేట్ కంపెనీలు కపూర్‌ ఫ్యామిలీకి చెందిన షెల్ కంపెనీలకు సొమ్ము తరలించినట్లు తెలుస్తోంది.
* కష్టాల్లో ఉన్న YES BANKను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

* గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ మాజీ కీలక ఎగ్జిక్యూటివ్‌ తన వాటాలను విక్రయించారు. తర్వాత..డిపాజిట్ల ఉపసంహరణ భారీగా పెరిగిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ ఓ కథనంలో పేర్కొంది. 
* ఇదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌లో బ్యాంకు షేర్‌ కూడా భారీగా పడిపోతూ వచ్చింది.
* బ్యాంకు మొండి బాకీల ఆందోళనకు తోడు మూలధన సమీకరణలో ప్రతికూలతల లను ఎదుర్కొంటుందని ఇండియా నివేష్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు రవికాంత్‌ ఆనంద్‌ భట్‌ గతంలో విశ్లేషించారు. 

Read More : టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి శిద్ధా రాఘవరావు!