Birthday Party : బాలికపై బ్లేడుతో దాడి చేసిన ఇద్దరు యువకులు

బ‌ర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తున్న బాలికపై ఇద్దరు యువకుడు బ్లెడ్ తో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

10TV Telugu News

Birthday Party : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్లోని ఎంపీ నగర్ ప్రాంతంలో ఓ బాలికపై ఇద్దరు యువకులు బ్లేడ్ తో దాడి చేశారు. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి బాలికను అడ్డగించారు. తమతో రావాలని వేధించారు.. బాలిక అందుకు ఒప్పుకోకపోవడంతో బ్లెడ్ తో ముఖంపై దాడి చేసి పారిపోయారు.

బాలిక కేకలు విన్న స్నానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుకు సంబదించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. అసోంకు చెందిన బాధిత బాలిక (19) భోపాల్‌లో అద్దె ఇంట్లో ఉంటుంది.

బర్త్ డే పార్టీకి వెళ్లివస్తున్న సమయంలో నిందితులు స‌లీం, సుమ‌ర్ బాలిక‌ను అడ్డ‌గించి బ్లేడుతో ఆమె ముఖాన్ని గాయ‌ప‌రిచిన అనంత‌రం పారిపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బాలికనుంచి వాగ్మూలం తీసుకున్నారు పోలీసులు.

10TV Telugu News