Youtube Go Live Together : యూట్యూబ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై క్రియేటర్లు ఇతర యూజర్లతో ఈజీగా కంటెంట్ లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు..!
Youtube Go Live Together : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ క్రియేటర్ల కోసం ‘గో లైవ్ టుగెదర్’ ఫీచర్‌ను ప్రకటించింది.

YouTube launches 'Go Live Together' feature What is it and how will it help creators
Youtube Go Live Together : ప్రముఖ గూగుల్ (Google) సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) క్రియేటర్ల కోసం ‘గో లైవ్ టుగెదర్’ ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్ క్రియేటర్లు తమ ఫోన్‌ల నుంచి ఇతర యూజర్లతో కంటెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు సాయపడుతుంది. YouTube లేటెస్ట్ క్రియేటర్-ఫోకస్డ్ ఫీచర్ కూడా ‘కో-లైవ్ స్ట్రీమ్’ వీడియోలకు గెస్ట్ యూజర్లను ఇన్వైట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
ప్రధానంగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు లక్ష్యంగా చేసుకుంది. డెస్క్‌టాప్ యూజర్ల కోసం కూడా కంపెనీ
త్వరలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టవచ్చని యూట్యూబ్ సూచించింది. TeamYouTube అకౌంట్ ద్వారా షేర్ చేసిన ట్వీట్ ప్రకారం.. మీ ఫోన్ నుంచి సులభంగా కో-స్ట్రీమ్‌ని ప్రారంభించేందుకు గెస్ట్ యూజర్లను ఇన్వైట్ చేసేందుకు గో లైవ్ టుగెదర్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. యూట్యూబ్ కో-స్ట్రీమ్‌లను హోస్ట్ చేసేందుకు క్రియేటర్‌లకు 50+ సబ్‌స్ర్కైబర్లు ఉండాల్సి ఉంటుంది.
యూట్యూబ్ ‘గో లైవ్ టుగెదర్’ ఫీచర్ :
యూట్యూబ్ (YouTube) సరికొత్త క్రియేటర్-సంబంధిత ఫీచర్ Android, iOS యూజర్లకు అందుబాటులో ఉంటుంది. YouTube మొబైల్ యాప్‌లో ‘Go Live’ బటన్ దిగువన ఉన్న క్రియేట్ సెక్షన్‌లో ‘Go Live Together’ ఆప్షన్ కనిపిస్తుంది. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ క్రియేటర్లు ఎవరైనా గెస్ట్ లింక్‌ను పంపేందుకు కూడా అనుమతిస్తుంది. యూట్యూబ్ క్రియేటర్లు వారి కంప్యూటర్‌ల నుంచి షెడ్యూల్ చేసిన లైవ్ స్ట్రీమ్‌లలో వారి ఫోన్‌ల నుంచి లైవ్ స్ట్రీమ్ చేసేందుకు కూడా YouTube అనుమతిస్తుంది. యూట్యూబ్ యూజర్లు తమ మొబైల్ ఫోన్ల నుంచి నేరుగా లైవ్ స్ట్రీమ్ చేసేందుకు ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.

YouTube launches ‘Go Live Together’ feature
ఇంకా, క్రియేటర్‌లు తమ లైవ్ స్ట్రీమ్‌లో ఉన్న గెస్ట్‌లను కూడా మార్చుకోవచ్చు. కానీ, యూట్యూబ్ క్రియేటర్లు తమ లైవ్ స్ట్రీమింగ్‌లో ఒకేసారి ఒక సబ్-హోస్ట్‌ను మాత్రమే కలిగి ఉంటారు. లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించిన యూజర్ స్ట్రీమ్ ఫీడ్ వారి గెస్టులు ఇన్వైట్ చేసిన తర్వాత కూడా కనిపిస్తుంది. YouTube Shorts రోజువారీ వ్యూస్ 50 బిలియన్లను దాటింది.
2020లో YouTube మరొక ప్రసిద్ధ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ TikTokతో పోటీ పడేందుకు YouTube Shorts సర్వీసును ప్రవేశపెట్టింది. Google నాల్గవ త్రైమాసిక ఆదాయాల కాల్ సమయంలో ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ YouTube షార్ట్‌లు ఇప్పుడు రోజువారీ వ్యూస్ 50 బిలియన్లను అధిగమించినట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 2022లో 30 బిలియన్ల రోజువారీ వ్యూ మార్కును అధిగమించింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..