YouTuber Agastay Chauhan : అతివేగం యూట్యూబర్ ప్రాణాలు తీసింది

300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసాడు. అతను చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది. యూట్యూబర్ అగస్టే చౌహాన్ అతి వేగంతో బైక్ నడిపి ప్రాణాలు కోల్పోయాడు.

YouTuber Agastay Chauhan : అతివేగం యూట్యూబర్ ప్రాణాలు తీసింది

YouTuber Agastay Chauhan

YouTuber Agastay Chauhan :  అతి వేగం ప్రమాదకరం అని ఎంత మొత్తుకుంటున్న యువత చెవికెక్కడం లేదు. రీసెంట్ గా అగస్టే చౌహాన్ అనే యూట్యూబర్ సూపర్ బైక్‌ను అతి వేగంగా నడిపి ప్రమాదానికి గురై  ప్రాణాలు కోల్పోయాడు.

50 Hours Buried : శవపేటికలో యూ ట్యూబర్..సమాధిలో 50 గంటలు..!!

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కి చెందిన అగస్టే చౌహాన్ ‘ప్రో రైడర్ 1000’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని రన్ చేస్తున్నాడు. రీసెంట్ గా సూపర్ బైక్ మీద యమునా ఎక్స్ ప్రెస్ వేపై గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కవాసకి నింజా ZX10R – 1,000cc సూపర్‌బైక్‌ను నడుపుతూ తన ఛానెల్ కోసం వీడియో కూడా తీస్తున్నాడు.

 

ఆగ్రా నుంచి ఢిల్లీకి వస్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అతను హెల్పెట్ పెట్టుకున్నప్పటికీ అతి వేగం కారణంగా అతి తునాతునకలైంది. తలకు తీవ్ర గాయాలై అగస్టే చనిపోయినట్లు తెలుస్తోంది. అలీఘర్‌లోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 47 మైల్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Armaan Malik : యూట్యూబర్ పై ఫైర్ అయిన బుట్టబొమ్మ సింగర్..

అగస్టే ఛానెల్‌కు దాదాపుగా 1.2 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన ఛానెల్‌లో అతను అప్ లోడ్ చేసిన చివరి వీడియోలో ఢిల్లీకి వెళ్తున్నట్లు.. తన బైక్‌ను 300 కిలోమీటర్ల వేగంతో నడపడానికి ప్రయత్నం చేస్తానని.. అంతకు మించిన వేగంతో  వెళ్లడానికి ప్రయత్నిస్తానని షేర్ చేశాడు. అలా అతి వేగంతో వెళ్లాలనే అతని ప్రయత్నం మరణాన్ని తెచ్చిపెట్టింది.

 

ఇటీవల కాలంలో చాలామంది యువత చిత్రవిచిత్రమైన ఫీట్లతో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అగస్టే అతివేగంతో బైక్ డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోయాడు.