Sanskrit: పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృతం.. విభజన తర్వాత ఫస్ట్ టైమ్..
సంస్కృతం ఒక పర్వతం లాంటిది. ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. మనం దానిని సొంతం చేసుకోవాలి.
Sanskrit: దేశ విభజన తర్వాత తొలిసారిగా పాకిస్తాన్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో ప్రాచీన భాష సంస్కృతంపై ఒక కోర్సు ప్రవేశ పెట్టినట్లు ది ట్రిబ్యూన్ తెలిపింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS) మహాభారతం, గీత వంటి హిందూ పురాణాలను కూడా చేర్చి ఈ కోర్సును ప్రవేశపెట్టింది.
“నేను సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నానని ప్రజలు నన్ను అడుగుతారు. మనం దానిని ఎందుకు నేర్చుకోకూడదని నేను వారికి చెప్తున్నా. సింధు లోయ నాగరికత సమయంలో ఇక్కడ చాలా రచనలు జరిగాయి. సంస్కృతం ఒక పర్వతం లాంటిది. ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. మనం దానిని సొంతం చేసుకోవాలి. అది మనది కూడా. ఇది ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు,” అని అసోసియేట్ ప్రొఫెసర్ షాహిద్ రషీద్ చెప్పారు.
“సంస్కృత తాళపత్ర మాన్యుస్క్రిప్ట్‌ల ముఖ్యమైన సేకరణను 1930లలో పండితుడు JCR వూల్నర్ క్యాటలాగ్ చేశారు. కానీ 1947 నుండి ఏ పాకిస్తానీ విద్యావేత్త కూడా ఈ సేకరణతో ఎంగేజ్ అవ్వలేదు. విదేశీ పరిశోధకులు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు. స్థానికంగా పండితులకు శిక్షణ ఇవ్వడం ద్వారా దానిని మారుస్తారు” అని గుర్మానీ సెంటర్ డైరెక్టర్ అలీ ఉస్మాన్ ఖాస్మిని తెలిపారు.
సంస్కృత కోర్సు మూడు నెలల వారాంతపు వర్క్‌షాప్‌గా ప్రారంభమైంది. చివరికి దానికి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ఫోర్ క్రెడిట్ విశ్వవిద్యాలయ కోర్సుగా మారింది. “మేము స్పందన చూసిన తర్వాత సరైన విశ్వవిద్యాలయ కోర్సుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాము. విద్యార్థుల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇది పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. 2027 వసంతకాలం నాటికి మేము భాషను ఒక సంవత్సరం పాటు బోధించగలగాలి”అని డైరెక్టర్ అన్నారు.
