YS Sharmila : కేసీఆర్ రాజీనామా చేయాలి..దళితుడిని సీఎం చేయాలి : షర్మిల

CM కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. వనపర్తి జిల్లాలోని గోపాల పేట మండలం తాడిపత్రిలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఇప్పటికైనా రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ చేశారు.

YS Sharmila : కేసీఆర్ రాజీనామా చేయాలి..దళితుడిని సీఎం చేయాలి : షర్మిల

Ys

Sharmila demands resignation of CM KCR : CM కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని గోపాల పేట మండలం తాడిపత్రిలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో చదువుకున్నవారికి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పిల్లలను చదివించి చంపుకునే కంటే చదివించకుండా బతికించుకుంటే బాగుండదని ఆత్మహత్య చేసుకున్న కొండల్ తల్లి ఆవేదన వ్యక్తంచేశారని ఇటువంటి తెలంగాణానా ప్రజలు కోరుకున్నది? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేని సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తప్పు అయ్యిందని చెప్పి ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఇంత కంటే దారణం ఏముంటుంది? ఇంతకంటే అవమానం ఇంకేం జరిగాలి కేసీఆర్ గారూ? అంటూ ప్రశ్నిచారు షర్మిల. ఇప్పటికైనా కేసీఆర్ రాజీనామా చేసి ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి మీరు ఎటైనా వెళ్లిపోండి..అప్పుడు మీరు నిరుద్యోగుల నెత్తిమీద పాలు పోయినవారు అవుతారని అన్నారు. కాగా తెలంగాణాలో పార్టీ పెడతాం అన్నప్పనుంచి కూడా షర్మిల సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తునే ఉన్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తునే ఉన్నారు. తెలంగాణలో ప్రజలు ఏమాత్రం సుఖంగా లేరని..రైతులు విద్యార్దులు తీవ్ర కష్టాలు పడుతున్నా కేసీఆర్ కు ఏమాత్రం పట్టటం లేదని విమర్శలు సందిస్తున్నారు.

కాగా తెలంగాణాలో పార్టీ పెడతాం అన్నప్పనుంచి కూడా షర్మిల సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తునే ఉన్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తునే ఉన్నారు. తెలంగాణలో ప్రజలు ఏమాత్రం సుఖంగా లేరని..రైతులు విద్యార్దులు తీవ్ర కష్టాలు పడుతున్నా కేసీఆర్ కు ఏమాత్రం పట్టటం లేదని విమర్శలు సందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం లేదని మనస్తాపం చెందిన కొండల్ అనే యువకుడు ఇటీవల తాడిపర్తిలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో షర్మిల తాడిపర్తిలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. తాడిపర్తికి చేరుకుని నేరుగా కొండల్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు.వారితో మాట్లాడి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆ తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైయ్యారు.కొండల్ ఇంటి నుంచి తాడిపర్తి బస్టాండ్ వరకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన షర్మిల అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై దీక్ష చేపట్టారు. కొండల్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.