Woman On Record : 30నిమిషాల్లో 134 వంటకాలు…రికార్డుకెక్కిన తమిళనాడు మహిళ

గతంలో కేరళకు చెందిన హయోన్ అనే 10సంవత్సరాల బాలుడు గంట వ్యవధిలో 122 వంటకాలను తయారు చేసిన రికార్డు ఉంది . అయితే ఆ రికార్డును తిరగరాసే

Woman On Record : 30నిమిషాల్లో 134 వంటకాలు…రికార్డుకెక్కిన తమిళనాడు మహిళ

Indira (2)

Woman On Record : పాకశాస్త్రం కూడా ఒక కళే.. వంటలు చేయటమంటే అంతా ఆషామాషీ ఏంకాదు. అదులోనే తక్కువ సమయంలో అందరిని మెప్పించేలా వంటలు చేయాలంటే అతిపెద్ద సాహసమే చేయాలి. అయితే తమిళనాడుకు చెందిన ఓ మహిళా 30 నిమిషాల సమయంలో ఏకంగా 134 వంటకాలు సిద్ధం చేసి పాక కళలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…

తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంకు చెందిన ఇందిరా రవిచంద్రన్ వంటలు చేయటంలో మంచి దిట్ట. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షణలో తక్కువ సమయంలో ఎక్కువ వంటకాలు చేసి రికార్డుల్లోకి ఎక్కెందుకు తన ప్రయత్నం ప్రారంభించింది.

గతంలో కేరళకు చెందిన హయోన్ అనే 10సంవత్సరాల బాలుడు గంట వ్యవధిలో 122 వంటకాలను తయారు చేసిన రికార్డు ఉంది . అయితే ఆ రికార్డును తిరగరాసే ప్రయత్నంలో భాగంగా ఇందిర అరగంట వ్యవధిలో 130 వంటకాలను చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా  ఏకంగా 134 వంటకాలను తయారు చేసింది. నాలుగు వంటకాలను అదనంగానే తయారు చేయగలిగింది. ఆమె తయారు చేసిన వాటిలో దోస, ఇండ్లీ, అమ్లెట్, ఊతప్పం, ఐస్ క్రీం, చికెన్ కర్రీ, బిర్యానీ, ఫిష్ కర్రీ, వంటి అనేక రుచికరమైన ఆహార పదార్ధాలు ఉన్నాయి.

ఇంత తక్కువ సమయంలో ఇన్ని వెరైటీలు తయారు చేయటమంటే సాధ్యమయ్యే పనికాదని చాలా మంది భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇందిర అరగంట వ్యవధిలోనే 134 వంటకాలను చేసి చూపించింది. గతంలో ఉన్న రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డులు నెలకొల్పిన ఇందిరా రవిచంద్రన్ ను అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడులో పెద్ద పాపులర్ గా మారారు. అనేక టివి ఛానళ్ళు ఆమెను తమ వంటల కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాలంటూ ఆహ్వానిస్తున్నారు.