Protein Shake : అధిక రక్తపోటును తగ్గించి, జీర్ణ వ్యవస్ధను మెరుగు పరిచే హోంమేడ్ ప్రొటీన్ షేక్!

శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడితే నీరసం, అలసట, జీర్ణ వ్యవస్థ నెమ్మదించడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడటం, కీళ్ళు కండరాల నొప్పులు, మూత్రపిండాల పనితీరుకు అడ్డంకులు, జుట్టు అధికంగా రాలడం, శరీర బరువును అదుపు తప్పడం తదితర సమస్యలు ఎదురవుతాయి.

Protein Shake : అధిక రక్తపోటును తగ్గించి, జీర్ణ వ్యవస్ధను మెరుగు పరిచే హోంమేడ్ ప్రొటీన్ షేక్!

Protein Shake

Updated On : October 6, 2022 / 7:36 AM IST

Protein Shake : శరీరానికి అవసరమయ్యే వనరుల్లో ప్రోటీన్ అతిముఖ్యమైనది. మనం తీసుకునే సగం ప్రోటీన్ ఎంజైమ్‌ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆహారం జీర్ణం కావడంలో ఈ ఎంజైమ్‌లు ప్రధాన పాత్ర వహిస్తాయి. మరోవైపు శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి కూడా ప్రోటీన్ అవసరమౌతుంది. హార్మోన్లు సాఫీగా పనిచేయడం, ఆకలిని నియంత్రించడం, బరువును నియంత్రించడం, గాయాలను త్వరగా మాన్పించడం తదితర విధులలో ప్రోటీన్లు కీలకం.

శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడితే నీరసం, అలసట, జీర్ణ వ్యవస్థ నెమ్మదించడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడటం, కీళ్ళు కండరాల నొప్పులు, మూత్రపిండాల పనితీరుకు అడ్డంకులు, జుట్టు అధికంగా రాలడం, శరీర బరువును అదుపు తప్పడం తదితర సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే ప్రోటీన్ పౌడర్ల ను వాడుతుంటారు. మార్కెట్లో లభించే ప్రొటీన్ పౌడర్లను వాడుకునే కంటే తక్కువ ఖర్చులో ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. అదేలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హోంమేడ్ ప్రొటీన్ షేక్ తయారీ ;

ఒక చిన్నకప్పు సోయా బీన్స్ ఒక బౌల్ లో వేసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు నానబెట్టుకున్న సోయా బీన్స్‌ను మిక్సీ జార్లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి సోయా పాలను వేరు చేసుకోవాలి. అనంతరం బ్లెండర్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోస్ట్డ్‌ ఓట్స్, వన్‌ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్‌ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఐదు బాదం పప్పులు, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్‌, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ సోయా పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో హెల్తీ అండ్ టేస్టీ ప్రోటీన్ షేక్‌ రెడీ అయిపోతుంది. ఈ హోమ్ మేడ్‌ ప్రోటీన్ షేక్ ను ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

రోజువారిగా అవసరమైన ప్రొటీన్లు దీని ద్వారా అందుతాయి. అంతేకాకుండా ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి. బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. నీరసం, అలసట, ఒత్తిడి వంటివి దూరం అవుతాయి. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. జుట్లు రాలటం , చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.