Simple Mouthwash : సాధారణ మౌత్‌వాష్‌‌తో కరోనా ఖతం.. నోట్లోనే వైరస్‌ను చంపేయొచ్చు..!

Simple Mouthwash : సాధారణ మౌత్‌వాష్‌‌తో కరోనా ఖతం.. నోట్లోనే వైరస్‌ను చంపేయొచ్చు..!

A Simple Mouthwash Save You From Covid 19 Virus

Simple Mouthwash Save from COVID : సాధారణ మౌత్‌వాష్‌లతో కరోనావైరస్‌‌ను ఖతం అవుతుందంట.. శరీరం లోపలికి వెళ్లడానికి ముందే నోట్లోనే వైరస్‌ను చంపేయొచ్చునని ఒక అధ్యయనం చెబుతోంది. జర్నల్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ డెంటల్ రీసెర్చ్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. కొన్ని నిర్దిష్ట పదార్థాలతో తయారైన చవకగా లభించే మౌత్ వాష్ ఉత్పత్తులతో SARS-CoV-2 వైరస్‌ను నిర్మూలించడంలో అత్యంత ప్రభావవంతమైనవిగా అధ్యయనంలో తేలింది. COVID-19 కారణమయ్యే వైరస్‌ను చంపేస్తాయనడానికి ఆధారాలు ఉన్నాయని సూచిస్తోంది. కరోనావైరస్ లాలాజలం నుండి ఊపిరితిత్తులలోకి నేరుగా నోటి నుండి రక్తప్రవాహంలోకి వెళుతుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా చిగుళ్ళ వ్యాధితో బాధపడేవారిలో ఎక్కువగా కరోనా బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కరోనావైరస్ లాలాజలం ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే ముప్పు అధికంగా ఉందని, అది మరణానికి దారితీయొచ్చునని అంటున్నారు పరిశోధకులు. ఊపిరితిత్తుల రక్త నాళాలు ప్రారంభంలో వైరస్ కారణంగా ప్రభావితం అవుతాయని ఆధారాలు చూపిస్తున్నాయి. SARS-CoV-2 వైరస్ ఊపిరితిత్తులకు చేరే అవకాశం ఉంది. ఫలితంగా తీవ్రమైన కేసులకు కారణమయ్యే దంతక్షావం, మంటతో పాటు నొప్పి మరింత తీవ్రతరం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నోటి ఆరోగ్య సంరక్షణ ద్వారా కరోనా నుంచి రక్షణ పొందొచ్చునని నిపుణులు అంటున్నారు.

Mouth Wash

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రోగుల్లో ఊపిరితిత్తుల CT స్కాన్‌లు చేయగా చిగుళ్ల రక్తస్రావం ద్వారా శరీరంలోకి వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు. పళ్లపై పాచి పేరుకుపోవడం ద్వారా చిగుళ్ళ వ్యాధితో చిగుళ్ళను లీక్ చేస్తుంది. సూక్ష్మజీవులు రక్తంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుందని పరిశోధకులు గుర్తించారు. టూత్ బ్రషింగ్ ఇంటర్‌డెంటల్ బ్రషింగ్, నిర్దిష్ట మౌత్‌వాష్‌లతో పాటు, చిగుళ్ల వాపును తగ్గించడానికి ఉప్పునీటితో పుక్కిలించడం చేస్తుండాలని సూచిస్తున్నారు. తద్వారా లాలాజలంలో వైరల్ సాంద్రతను తగ్గించడంలో సాయపడుతుందని అంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధిని తగ్గించడమే కాదు.. తీవ్రమైన COVID-19కు ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని పరిశోధకులు తెలిపారు.

చిగుళ్ళలోని రక్త నాళాల నుంచి వైరస్ మెడ ఛాతీ సిరల గుండా వెళుతుంది. పల్మనరీ ధమనులో ఊపిరితిత్తుల అంచులలోని చిన్న నాళాలలోకి పంపే ముందు గుండెకు చేరుకుంటుందని పరిశోధకులు చెప్పారు. ఈ కొత్త మోడల్‌ను మరింత పరిశోధించడానికి అధ్యయనాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో రోజువారీ నోటి పరిశుభ్రత, నోటి ఆరోగ్యంతో కరోనా నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.