Delhi Air Pollution : ఢిల్లీ పొల్యూషన్‌కి.. సొల్యూషనే లేదా?

ఎవరైనా.. గాలి పీల్చకపోతే చనిపోతారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీలిస్తే చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటిలాగే.. ఈ శీతాకాలంలోనూ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది. ఈసారి కాస్త ముందుగానే.. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. అప్పుడే 450 పాయింట్లకు చేరుకుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Delhi Air Pollution :  ఢిల్లీ పొల్యూషన్‌కి.. సొల్యూషనే లేదా?

Delhi Air Pollution

Delhi Air Pollution : ఎవరైనా.. గాలి పీల్చకపోతే చనిపోతారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీలిస్తే చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటిలాగే.. ఈ శీతాకాలంలోనూ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది. ఈసారి కాస్త ముందుగానే.. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. అప్పుడే 450 పాయింట్లకు చేరుకుంది. దీంతో.. ఢిల్లీ సర్కార్ తక్షణ చర్యలు మొదలుపెట్టింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

వింటర్ సీజన్ ఎంటర్ అయితే చాలు.. ఢిల్లీ వణికిపోతుంది. కానీ.. ఆ వణుకు చలి వల్ల కాదు. ఎయిర్ పొల్యూషన్‌ వల్ల. రోజురోజుకు.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో.. వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గాలి నాణ్యత కూడా మరింత కిందకు పడిపోతోంది. ఇప్పటికే.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 పాయింట్లను దాటేసింది. దీంతో.. ఢిల్లీ డేంజర్ లెవెల్‌లోకి వెళ్లిపోయింది. బవానా ప్రాంతంలో అత్యధికంగా 483 పాయింట్లు నమోదైంది. ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్‌లో పొగమంచు దట్టంగా పేరుకుపోయింది. నోయిడాలో పొల్యూషన్ స్థాయి భారీగా పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటడంతో.. నవంబరు 8 వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. హర్యానాలోని గురుగ్రామ్, ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలో.. ఏక్యూఐ 539 పాయింట్లుగా ఉంది. ఇంకొన్ని చోట్ల 7 వందల పాయింట్లు కూడా దాటింది. దీనిని బట్టే.. అర్థం చేసుకోవచ్చు ఢిల్లీలో గాలి నాణ్యత ఏ మేరకు పడిపోయిందో.

గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు.. ఆప్ సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. 50 శాతం ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది.. ఇంటి నుంచే పని చేసేలాఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని అనుసరించాలని సూచించింది. ఇక.. కొన్ని రోజుల పాటు అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకునేంత వరకు.. ప్రైమరీ తరగతులకు విరామం ఇవ్వనున్నారు. ఐదు, ఆ పైతరగతుల విద్యార్థులకు.. అవుట్‌డోర్‌ గేమ్స్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఢిల్లీ సీఎం. అంతేకాదు.. ట్రాఫిక్‌ నియంత్రణకు మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయడంపైనా ఆలోచిస్తున్నారు సీఎం కేజ్రీవాల్.

వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో.. అత్యవసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలు, సీఎన్‌జీతో నడిచే వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే.. ఢిల్లీలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద వాహనాలు, బీఎస్-4 డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించారు. వీటితో పాటు క‌మ‌ర్షియ‌ల్ డీజిల్ ట్రక్స్‌ని కూడా ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లోకి అనుమతించొద్దని నిర్ణయించారు. అంతేగాక.. రోడ్లు వేయ‌డం, బ్రిడ్జిలు నిర్మించ‌డం, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు, ప‌వ‌ర్ ట్రాన్సిమిష‌న్ యూనిట్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయ‌నున్నారు.

వాస్తవానికి.. పంజాబ్‌, హర్యానా, యూపీలోని రైతులు పంట వ్యర్థాలను కాల్చివేస్తుండటం వ‌ల్ల.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఇది.. కొన్నేళ్లుగా జరుగుతూ వస్తున్నదే. అయితే.. ఎయిర్ పొల్యూషన్ అనేది ఉత్తర భారత సమస్య అని.. ఇందుకు ఢిల్లీ ప్రభుత్వం గానీ, పంజాబ్ ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించవని చెప్పారు కేజ్రీవాల్. ఒకరిపై ఒకరు నిందలు వేయడానికి.. ఇది సరైన సమయం కాదన్నారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చివేయడానికి తామే బాధ్యులమన్నారు కేజ్రీవాల్. వరి వ్యర్థాలను కాల్చివేయాలని రైతులు కూడా కోరుకోవడం లేదని.. కానీ రెండు పంటల మధ్య తక్కువ సమయం ఉన్నందు వల్లే.. మరో ఆప్షన్ లేక అలా చేస్తున్నారని చెబుతున్నారు. కానీ.. అలా చేయడం వల్ల.. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు గాలి పీల్చలేని విధంగా ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకరస్థాయికి చేరుతోంది. దీంతో.. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు తలెత్తాయి.

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు.. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రాల సీఎస్‌లంతా.. నవంబర్ 10 లోపు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముందు హాజరు కావాలని కోరింది. ఇక.. వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాల కాల్చివేతపై.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కి లేఖ రాశారు. పంట వ్యర్థాల కాల్చివేతను అడ్డుకునేందుకు.. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు. దీని కారణంగా.. దేశ రాజధాని ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్‌లా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని అందులో తెలిపారు. దీనిపై.. ఈ నెల పదో తేదిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
స్పాట్..