Cumin : చర్మవ్యాధులను తగ్గించటంతోపాటు, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా రక్షణనిచ్చే జీలకర్ర!
జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సుఖనిద్ర కోరుకొనే వారు జీలకర్ర నీటిని సేవించడం ఉత్తమం. జీలకర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపు లో ఉంటుంది. మతి మరుపు సమస్యను జీలకర్ర దూరం చేస్తుంది.

Cumin
Cumin : బరువు తగ్గడం మొదలు జీర్ణ సమస్యల వరకూ ఎన్నో సమస్యలు జీలకర్రతో పరిష్కారమౌతాయి. ప్రతి ఇంటి పోపులపెట్టెలో తప్పనిసరిగా ఉండే జీలకర్ర ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. మసాలా దినుసుల్లో భాగమైన ఈ జీలకర్రను రోజువారిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రక్తంలో హీమోగ్లోబిన్ తయారవటానికి కావలసిన ముఖ్యపోషకమైన ఐరన్ జీలకర్ర పుష్కలంగా కలిగి ఉంటుంది. రోజూ పరగడుపున జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రక్తహీనత తొలగిపోతుంది.శరీరంలో ఐరన్ తగ్గటం వల్ల అనీమియా వస్తుంది. ఆహారంలో జీలకర్రని కలుపుకోని తీసుకోవటం వల్ల తగినంత ఐరన్ శరీరానికి అందుతుంది.
అజీర్తి, కడుపులో వికారం, కడుపులోని అల్సర్లు వదిలిపోతాయి. కడుపులో నులి పురుగులు చనిపోతాయి. కిడ్నీలోని రాళ్లు కరుగుతాయి. జీలకర్ర నీటిని తాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. జీలకర్ర లేహ్యన్ని ముఖానికి పూసుకోవటం వల్ల మొటిమలు, గజ్జి, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను త్వరగా తగ్గిస్తుంది. జీలకర్రలో విటమిన్ ‘ఈ’ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగానూ, ప్రకాశవంతంగాను చేస్తుంది.
నెలసరిని క్రమంగా వచ్చేలా చేయడంతోపాటు నెలసరిలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరం రుతుక్రమ సమయంలో ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆలివ్ ఆయిల్, జీలకర్ర ఆయిల్ సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి జుట్టుకి రాయటం వలన వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుంది. జుట్టు రాలటం ఆగిపోతుంది.
దీనివల్ల దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు దరిజేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మలినాలను, ఫ్రీ-రాడికల్స్’ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రక్తసరఫరా మెరుగు పడటమే గాక రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగి గుండె సమస్యలు రావు.
జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సుఖనిద్ర కోరుకొనే వారు జీలకర్ర నీటిని సేవించడం ఉత్తమం. జీలకర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపు లో ఉంటుంది. మతి మరుపు సమస్యను జీలకర్ర దూరం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జీలకర్రలోని మూలకాలు నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జీలకర్రను ఉదయాన్నే తినడం వల్ల అందులోని యాంటీ బాక్టీరియల్ మూలకాలు మొటిమలు రాకుండా రక్షణగా నిలుస్తాయి.