కొవిడ్-19 నయం చేస్తాయంటున్న ఈ డ్రగ్స్ అంతా స్కామ్..?! ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు?

  • Published By: sreehari ,Published On : July 10, 2020 / 05:57 PM IST
కొవిడ్-19 నయం చేస్తాయంటున్న ఈ డ్రగ్స్ అంతా స్కామ్..?! ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు?

అసలే మహమ్మారి కాలం.. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ ప్రాణాంతకంగా మారిపోతున్న కరోనాకు ఇప్పటివరకూ సరైన మందు లేదు. కానీ, కొవిడ్-19 వ్యాక్సిన్ కనిపెట్టేందుకు మాత్రం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అది ఎంతవరకు కరోనా నివారించగలదో గ్యారెంటీ లేదు. ఒకవేళ వ్యాధి తీవ్రతను తగ్గించినా… వ్యాధి సంక్రమణను మాత్రం నివారించలేదని పలు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా అసలైన మందు లేదనేది అక్షర సత్యం.. కరోనా నయం చేస్తాయని చెబుతున్న డ్రగ్స్ కూడా పూర్తి స్థాయిలో కరోనాను నివారించలేవని పలు నివేదికలు చెబుతున్నాయి. కరోనాను నయం చేయగల మందుల పేరుతో మార్కెట్లోకి చెలామణీ అయ్యే డ్రగ్స్ ఏమైనా ఉంటే అదంతా స్కామ్ అనే వాదన వినిపిస్తోంది. కరోనా క్యూర్ పేరిట విక్రయించే ఎలాంటి మందులతోనూ కరోనాను నివారించలేవని, అదంతా స్కా్మ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోవిడ్ నుంచి ఈ డ్రగ్స్ కోలుకునేలా చేస్తాయా? :
ప్రస్తుతం కోవిడ్-19 క్యూర్ పేరిట వస్తున్న కొన్ని డ్రగ్స్ విషయంలో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కోవిడ్ తో తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి వెంటనే కోలుకునేలా చేస్తాయనడంలో వాస్తవం లేదని అంటున్నారు. అందులో కరోనా నయం చేసే corticosteroid dexamethasone డ్రగ్ కూడా వైరస్ బాధితులు బతికే అవకాశాలను మాత్రమే మెరుగుపరుస్తుంది. అంతే తప్పా వారిలోని వైరస్‌తో పోరాడదు.

శరీరంలో ఇన్ ప్లేమెంటరీ రెస్పాన్స్ (తాపజానక ప్రతిస్పందన) తగ్గిస్తుందంతే.. పూర్తి అనారోగ్యాన్ని తగ్గించేలా మాత్రం పనిచేయదు. తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి కూడా పెద్దగా సాయపడదని చెబుతున్నాయి. ఇప్పటివరకు కరోనా చికిత్సలో ఉత్తమ ఔషధంగా పేరొందిన Remdesivir డ్రగ్ కొద్ది మొత్తంలో అనుకూల ఫలితాలు కనిపించాయి. కానీ ఈ డ్రగ్ కూడా అద్భుత నివారణ కాదు. ఇక హైడ్రాక్సీక్లోరోక్విన్ విషయంలోనూ ఇదే తరహా వాదన వినిపిస్తోంది. కానీ ట్రయల్స్‌లో దాని పనితీరు పరిశోధకులను సైతం నిరాశపరిచిందనే చెప్పాలి.

చట్ట విరుద్ధ సంస్థలకు 86 లేఖలతో FDA హెచ్చరిక :
కరోనా వైరస్ నివారణకు వాడే చాలా డ్రగ్ ఉత్పత్తులతో పరిమిత ఫలితాలే ఇప్పటివరకూ కనిపించాయి. COVID-19 క్యూర్ పేరిట మార్కెట్లో కొన్ని హానికరమైన సమ్మేళనాలతో అమ్ముడవుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. కరోనావైరస్‌కు చికిత్స చేయగలమని, నివారించవచ్చని లేదా నయం చేయవచ్చని చట్టవిరుద్ధంగా పేర్కొన్న సంస్థలకు FDA హెచ్చరిస్తూ 86 లేఖలను రాసింది.

colloidal silver సంబంధిత ఉత్పత్తుల్లో ఏవి కూడా వైరస్ నయం చేయలేవని, పైగా హానికరం కూడా అనే వాదన లేకపోలేదు. CBD ఉత్పత్తులతో తరచూ ఏదో ఒక వ్యాధి నివారణకు విక్రయిస్తుంటారు. వీటిలో ఏదైనా డ్రగ్ పనిచేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. హోమియోపతిక్ ‘డ్రగ్స్’ FDA నిబంధనలలో లొసుగును సూచిస్తోంది. ఇవి కూడా పనిచేయవనే వాదన బలంగానే ఉంది. ముఖ్యమైన నూనెలు, మూలికా చికిత్సలు, ఆహార పదార్ధాలు వంటి అనేక ఇతర ఉత్పత్తుల ద్వారా COVID-19 నివారణకు సాయపడతాయనడానికి జీరో ఆధారాలు ఉన్నాయి.

బ్లీచ్ తాగడం వల్ల కరోనా పోదు :
FDA షిట్‌లిస్ట్‌లోని ఉత్పత్తులలో ఒకటి COVID-19 కు అసలైన వ్యాక్సిన్‌గా మార్కెట్ చేస్తుంది. కరోనావైరస్ వ్యాక్సిన్లపై కూడా పెద్ద ఎత్తున ట్రయల్స్ జరిగినట్టు ఎక్కడా లేదు. వినియోగదారుల లభ్యత చాలా తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్లీచ్‌గా పిలిచే పదార్థం కూడా కరోనా నివారణగా విక్రయిస్తున్నారు.

అయితే బ్లీచ్ తాగడం వల్ల కరోనా నయం కాదని గుర్తించాలి. COVID-19 నివారణగా MMSను అమ్ముతున్న ఓ ప్రాంతంపై కూడా గతవారమే FBI దాడులు నిర్వహించింది. COVID-19 ఒక వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్ లేదా అది కలిగించే సంక్రమణకు వ్యాక్సిన్ నివారణ, చికిత్స లేదా నివారణ లేదని గుర్తించాలి.

ఇవన్నీ తాత్కాలిక చికిత్సలే : వైరస్ బతికే ఉంటుంది :
మీకు కరోనా ఉందని మీరు అనుమానిస్తే.. మీరు వైద్యుడిని (ఫోన్ లేదా వర్చువల్ విజిట్ ద్వారా) సంప్రదించాలి. ఇతరులకు సోకకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవడం ఎంతో ఉత్తమం.

సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. ఏదైనా శ్వాసపరమైన సమస్యలు ఉంటే వెంటనే తక్షణ వైద్య సాయం పొందాల్సి ఉంటుంది. కరోనాకు అందించే ప్రస్తుత చికిత్సలన్నీ కేవలం వైరస్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు ఉపశమనం ప్రయత్నాలే తప్పా.. పూర్తి స్థాయిలో వైరస్ ను నాశనం చేయలేవని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలి.