Blood Sugar : రక్తంలో షుగర్ వెవల్స్ తగ్గుతున్నాయా…అయితే జాగ్రత్త?

క్రమబద్ధమైన జీవన విధానం, మానసిక ప్రశాంతత, కసరత్తులో ఈ పరిస్ధితి నుండి బయటపడవచ్చు. డయాబెటిస్ అనేది జన్యు సంబంధిత వ్యాధి. దీనిలో టైప్ 1, టైప్ 2 అనే రెండు రకాలు ఉన్నాయి.

Blood Sugar : రక్తంలో షుగర్ వెవల్స్ తగ్గుతున్నాయా…అయితే జాగ్రత్త?

Blood Sugar

Blood Sugar : రక్తంలోని గ్లూకోజ్‌ను బ్లడ్ షుగర్ అంటారు. గ్లూకోజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే టైప్-2 డయాబెటిస్ ఉన్న వారిలో చోటు చేసుకుంటాయి. డయాబెటీస్ రోగులకు ఏదో ఒక దశలో కొన్ని మార్లు రక్తంలో షుగర్ స్ధాయిలు తగ్గిపోతాయి. షుగర్ లెవల్ పై అదుపు సాధించటం వీరికి అంత సులభమైనదికాదు. నీరసం, వణుకు, చెమటలుపట్టటం, కళ్ళు తిరగడం, తలనొప్పి ఈ లక్షణాలన్నీలో బ్లడ్ షుగర్ కు సంకేతాలు. కొన్ని సందర్భాలలో తక్షణం చికిత్స చేయకపోతే, హైపో గ్లైసీమియా ప్రాణాలమీదకు వస్తుంది. స్ప హ కోల్పోయే ప్రమాదం ఉంది. తర్వాతి దశగా రోగి డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోతాడు.

క్రమబద్ధమైన జీవన విధానం, మానసిక ప్రశాంతత, కసరత్తులో ఈ పరిస్ధితి నుండి బయటపడవచ్చు. డయాబెటిస్ అనేది జన్యు సంబంధిత వ్యాధి. దీనిలో టైప్ 1, టైప్ 2 అనే రెండు రకాలు ఉన్నాయి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఈ రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచవచ్చు. ఫైబర్, ప్రొటీన్, విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఫుడ్స్ ను తీసుకోవటం, శారీరకంగా చురుగ్గా ఉండటం వంటివి అవసరం. ఆహారం అధిక మోతాదులో తీసుకోవటం, ఆహారం తీసుకోవటంలో సమయం పాటించకపోవటం, ప్రాసెస్డ్, ఇన్స్టంట్ ఫుడ్స్ వల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఇలాంటి వారు గుండె జబ్బుల బారి పడాల్సి వస్తుంది. కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి.

రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుగా ఉంటే అది రక్త నాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరంలో రక్తం సరిగ్గా ప్రవహించకపోతే అవసరమైన అన్ని అవయవాలకు రక్తం చేరక నాడీ వ్యవస్థ దెబ్బతిని, చూపు కోల్పోవటం, కాళ్లకు ఇన్ఫెక్షన్లు రావటం, కిడ్నీలు దెబ్బతినటం, గుండె పోటు, పక్షవాతం, గ్యాంగ్రిన్ వంటివి వెలుగుచూస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉండే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టైప్2 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో మార్పులు హెచ్చుతగ్గులు అతిగా ఉంటే అలాంటి వారు ఏక్షణాల్లోనైనా మృత్యువు కబళించే అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. సకాలంలో చికిత్స తీసుకుని వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది.