Milk increases weight : పాలు తాగితే బరువు పెరుగుతామని భయపడుతున్నారా! పాలు తాగినా బరువు పెరగకుండా ఉండాలంటే?

వ్యాయామం తర్వాత పాలు తాగడం వల్ల సన్నని కండరాలను నిర్మించడంలో , శరీర కూర్పును మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వెన్న తీయ‌ని పాల‌లో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఆ పాల‌ను తాగితే బ‌రువు పెరుగుతారు.

Milk increases weight : పాలు తాగితే బరువు పెరుగుతామని భయపడుతున్నారా! పాలు తాగినా బరువు పెరగకుండా ఉండాలంటే?

weight if you drink milk

Milk increases weight : పాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఓ గ్లాసు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు క‌లిగుతాయని వైద్యులు చెప్పే మాట. వాస్తవానికి పాలు చ‌క్క‌ని ఆహారం. పాల‌ల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఒక గ్లాసు పాల‌లో 8 గ్రాముల ప్రోటీన్‌, 300 మిల్లీగ్రాముల కాల్షియం, పొటాషియం, విట‌మిన్ డి, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. పాలలో సహజంగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇందులోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

వ్యాయామం తర్వాత పాలు తాగడం వల్ల సన్నని కండరాలను నిర్మించడంలో , శరీర కూర్పును మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వెన్న తీయ‌ని పాల‌లో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఆ పాల‌ను తాగితే బ‌రువు పెరుగుతారు. అదే వెన్న తీసిన పాలు అయితే వాటిలో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక బ‌రువు త‌గ్గుతారు.బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వెన్న తీసిన పాలు తాగాలి.

గేదె పాలు కంటే ఆవు పాలలో తక్కువ కొవ్వు ఉంటుంది. ఆవు పాలను తేలికైన పాలు ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఆవు పాలలో కొవ్వు 3-4 శాతం ఉండగా, గేదె పాలలో 7-8 శాతంతో అధికంగా కొవ్వు ఉంటుంది. ఆవు పాలు కంటే గేదె పాలలో ప్రోటీన్లు 10-11 శాతం అధికంగా లభిస్తాయి.

పాలు త్వ‌ర‌గా జీర్ణం కావు. కానీ ఇది అంద‌రికీ ఒకేలా ఉండ‌దు. పాల‌లో ఉండే లాక్టోస్ అనే ప‌దార్థం వ‌ల్ల కొంద‌రికి పాలు జీర్ణం కావు. దీంతో గ్యాస్‌, అసిడిటీ వ‌స్తాయి. దీన్నే లాక్టోస్ ఇన్‌టోల‌రెంట్ అని పిలుస్తారు. ఈ స‌మ‌స్య కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే వ‌స్తుంది. పాలు జీర్ణం అయ్యే వారు వాటిని నిర్భ‌యంగా తాగ‌వ‌చ్చు. పాలు తాగడం వల్ల శరీర కండరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

పిల్ల‌లు, పెద్ద‌లు ఎవ‌రైనా స‌రే పాల‌ను నిత్యం అంద‌రూ తాగ‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కీల‌క పోషకాల‌ను పాలు అందిస్తాయి. చిన్నారుల‌కు ఆవు పాలు తాగించాలి. యుక్త వ‌య‌స్సులో ఉండేవారు టోన్డ్ మిల్క్ తాగాలి. అదే పెద్ద‌లు అయితే స్కిమ్మ్‌డ్ మిల్క్ తాగాలి.