Eggs : పచ్చి కోడిగుడ్డు తాగుతున్నారా!… ప్రమాదకరమేనా?..

క్రీడాకారుల్లో చాలా మంది శరీర ధారుఢ్యం కోసం పచ్చిగుడ్డును తాగడానికి ఇష్టపడతారు. పచ్చి కోడిగుడ్లల్లోసాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కొంతవరకు ఇది హానికారకం. చెడిపోయిన కోడిగుడ్డులో ఈ బ్యాక్టీరియా శాతం అధికంగా ఉంటుంది.

Eggs : పచ్చి కోడిగుడ్డు తాగుతున్నారా!… ప్రమాదకరమేనా?..

Eggs

Eggs : కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం. మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. మార్కెట్‌లో పేదలు నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ధరలో లభించే పౌష్టికాహారం ఇది. తెల్లసొన, పచ్చసొన కాంబినేషన్‌ ఉంటుంది. ఇందులో చాలామంది తెల్లసొనను తినడానికి ఇష్టపడరు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని అభిప్రాయం ప్రజల్లో ఉంది. గుండెకు అంత మంచిది కాదని చెబుతుంటారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి.

కోడిగుడ్డులో ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలు కలిగించేవే. కోడిగుడ్డులో అధిక వాటాను కలిగి ఉండేది తెల్లసొనే. గుడ్డు పైపొర 11 శాతం, పచ్చసొన 33 శాతం ఉంటుంది. తెల్లసొన 56 శాతం. నీరు, ప్రొటీన్ల కాంబినేషన్ ఇది. కండరాలు బలపడటానికి అవసరం అయ్యే ప్రొటీన్ల శాతం కోడిగుడ్డులో అధికంగా ఉంటుంది. అందుకే అథ్లెట్లు, బాడీ బిల్డర్లకు ఇది ప్రధాన ఆహారంగా మారింది. గుడ్డు ఖనిజాల గని. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. గుడ్డులో మరీ ముఖ్యంగా పచ్చసొనలో 12 ఖనిజాలు మరియు 8 లవణాలు ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలెస్ర్టాల్ అన్ని రకములైన జీవక్రియకు ఉపయోగపడుతుంది.

క్రీడాకారుల్లో చాలా మంది శరీర ధారుఢ్యం కోసం పచ్చిగుడ్డును తాగడానికి ఇష్టపడతారు. పచ్చి కోడిగుడ్లల్లోసాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కొంతవరకు ఇది హానికారకం. చెడిపోయిన కోడిగుడ్డులో ఈ బ్యాక్టీరియా శాతం అధికంగా ఉంటుంది. దాన్ని తిన్న తరువాత ఆరు గంటల నుంచి ఆరు రోజుల్లోగా అది మన శరీరంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, తరచూ డాక్టర్లను సంప్రదించే వారు ఈ బ్యాక్టీరియాకు దూరంగా ఉండాలి.

సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల వాంతులు అవుతాయి. జ్వరం వస్తుంది. డయేరియా సంభవించే ప్రమాదం ఉంది. పొత్తికడుపులో నొప్పి మొదలవుతుంది. అందుకే- పచ్చి కోడిగుడ్లను తాగడం మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్త చేస్తుంటారు నిపుణులు. సగం ఉడికించిన కోడిగుడ్లను తినడం ఏమాత్రం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని సూచిస్తున్నారు.