అమ్మాయిలను ఆకర్షించే టెక్నిక్ తెలియదా? మీరు ఒంటరిగా ఉండిపోవాల్సిందే!

అమ్మాయిలను ఫ్లటింగ్ (ఆకర్షించడం) చేయడం అనేది ఒక ఆర్ట్ అంటోంది కొత్త అధ్యయనం.. ఒక అమ్మాయిని ఈజీగా పడేయాలంటే అందుకు ఫ్లటింగ్ టెక్నిక్ తెలియాలంటోంది. అమ్మాయిలను ఫ్లటింగ్ చేసేందుకు ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ వారు ఇప్పటకీ సింగిల్ గానే మిగిలిపోతున్నారంట..

అమ్మాయిలను ఆకర్షించే టెక్నిక్ తెలియదా? మీరు ఒంటరిగా ఉండిపోవాల్సిందే!

You Not able to flirting might be single : అమ్మాయిలను ఫ్లటింగ్ (ఆకర్షించడం) చేయడం అనేది ఒక ఆర్ట్ అంటోంది కొత్త అధ్యయనం.. ఒక అమ్మాయిని ఈజీగా పడేయాలంటే అందుకు ఫ్లటింగ్ టెక్నిక్ తెలియాలంటోంది. అమ్మాయిలను ఫ్లటింగ్ చేసేందుకు ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ వారు ఇప్పటకీ సింగిల్ గానే మిగిలిపోతున్నారంట.. బార్ల నుంచి ఆన్‌లైన్ డేటింగ్ వరకు ఎంతో ట్రై చేసినప్పటికీ ఇప్పటికీ ఏక్ నీరంజన్ లా ఉండిపోతున్నారని ఓ కొత్త అధ్యయనంలో తేలింది.

దీని ప్రకారం.. అమెరికాలో 31శాతం మంది ఇంకా సింగిల్ గానే ఉన్నారంట.. చాలామంది ఒకే లైఫ్ స్టయిల్‌ను చాయిస్‌గా ఎంచుకుంటున్నారంట. కానీ, మరికొందరు మాత్రం ఆన్‌లైన్ డేటింగ్ ద్వారా తన పార్టనర్ ఎంచుకోవాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారనేది అర్థం చేసుకోలేకపోతున్నారంట.


ఇంతకీ తామెక్కడ తప్పు చేస్తున్నామో తెలియకపోవచ్చునని అధ్యయనం చెబుతోంది. నికోసియా యూనివర్శిటీకి చెందిన మెనెలాస్ అపోస్టోలో పర్సనాలిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం.. ఇన్ వాలంటరీ సింగిల్స్ అందరూ ఇప్పటికీ తమ జోడీని ఎంచుకోలేకపోవడానికి ప్రధాన కారణాలను సైంటిస్టులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 1,228 మంది గ్రీకు మాట్లాడే మహిళలు, 18 ఏళ్లు పైబడిన పురుషులపై పరిశోధక బృందం అధ్యయనం చేసింది. వీరిలో ప్రతి ఒక్కరూ ఒంటరితనానికి సంబంధించి ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు.

వీరిలో ఎవరూ ఎంతగా అమ్మాయిలను ఫ్లటింగ్ చేయగల సామర్థ్యం, ఆసక్తి ఉంది. అలాగే డేటింగ్‌ చేసేందుకు ఎంతకాలం ప్రయత్నించారు వంటి మొత్తం డేటాను సైంటిస్టులు సేకరించారు. ఈ డేటాలో అమ్మాయిలను ఆకర్షించలేకపోవడానికి వారిలో ఎలాంటి కారణాలు ఉన్నాయో విశ్లేషించారు. ఫ్లటింగ్ చేయలేకపోవడం అసలు కారణమని అధ్యయన ఫలితాల్లో తేలింది.

ఇదే 50 శాతం ఒంటరి జీవనశైలి పెరిగేందుకు కారణమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్టనర్ ను ఎంచుకునే ప్రయత్నాల్లో ఫ్లటింగ్ స్కిల్స్ పెంచుకోవడమే బెస్ట్ అంటున్నారు. ఆకర్షించడం అనేది అందరికి ఇచ్చే గిఫ్ట్ కాదు.. ఆన్ లైన్ డేటింగ్, ట్రేడేషన్ డేటింగ్ లో ఫ్లటింగ్ చేయడమనేది కీలకం.. ఒకరిపై మరొకరికి ఇష్టాన్ని పెంచడంలోనూ ఇదే ప్రధానమని సైంటిస్టులు చెబుతున్నారు.