Blood Clots : గుండె రక్త నాళాల్లో పూడికలు….ఎవరిలో ఎక్కువంటే?

ఈ బ్లాక్ లు గుండెకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. రక్త ప్రవాహాం సక్రమంగా జరగకుండా చేయటం వల్ల గుండె పోటు ముంచుకొస్తుంది.

Blood Clots : గుండె రక్త నాళాల్లో పూడికలు….ఎవరిలో ఎక్కువంటే?

Blood Clots

Blood Clots : గుండెలో ఉండే రక్తనాళాల్లో పూడికలు వచ్చి… గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోవటం చాలా మందికి తమ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య. ప్రస్తుత పరిస్ధితుల్లో గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గతంలో పెద్ద వయస్సు వారిలోనే ఉండే ఈ గుండె జబ్బులు ప్రస్తుతం యువత సైతం వీటి భారిన పడి చిన్న యవస్సులోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.

శరీరంలో రక్తం అన్ని భాగాలకు సాఫీగా సరఫరా జరుగుతుండాలి. ముఖ్యంగా గుండె శరీరం మొత్తానికి రక్తాన్ని పంపింగ్ చేసే ముఖ్యమైన విధిని నిర్వర్తిస్తుంటుంది. నిరంతరం గుండె కొట్టుకుంటూ పనిచేస్తూ ఉంటుంది. గుండె గోడల్లో ఉండే కరోనరీ ధమనులు గుండె గోడల పై పొరల్లో ఉండి గుండె కండరానికి నిరంతరం రక్తాన్ని అందిస్తుంటాయి.

కొన్ని పర్యాయాలు కొలెస్ట్రాల్ కొవ్వులు రక్త ప్రవాహానికి అడ్డుగా మారతాయి. వీటినే మనం బ్లాక్స్ అంటాం. ఈ బ్లాక్ లు గుండెకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. రక్త ప్రవాహాం సక్రమంగా జరగకుండా చేయటం వల్ల గుండె పోటు ముంచుకొస్తుంది. ఇలాంటి గుండె రక్తనాళాల్లో పూడికల కారణంగా మనిషి క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.

గుండె రక్తనాళల్లో పూడికలు ప్రధానంగా మధుమేహులు హైబీపీ ఉన్నవాళ్ళకు, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారికి , పొగతాగే అలవాటున్న వాళ్లకు, ఊబకాయులు , తగినంత శారీరక శ్రమ,వ్యాయామాలు చెయ్యనివారికి ఏర్పడతాయి. వీరితోపాటు 40-50 ఏళ్ల పైబడిన వారికి ఎక్కువగా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. ప్రస్తుతం 30-40 మధ్య వయసు వారిలో కూడా గుండె రక్తనాళాల్లో పూడికలు కనబడుతున్నాయి. చిన్న వయసు నుంచే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వీరితోపాటుగా రక్తంలో లైపోప్రోటీన్‌-ఎ, హోమోసిస్టీన్‌, కార్డియోలిపిన్‌, ఫైబ్రినోజెన్‌ వంటివి ఉన్నవారికీ పూడికలు వచ్చే ముప్పు ఎక్కువ. సాధారణంగా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయటం ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు.