Tulsi Water : ఒక్క గ్లాసు తులసి నీటితో మధుమేహాన్ని అదుపులో ఉంచొచ్చా?

తులసి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ హెర్బ్ ప్యాంక్రియాటిక్ బీటా-సెల్ ఫంక్షన్, ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు, కండరాల కణాల ద్వారా గ్లూకోజ్ తీసుకోవడం మరింత పెరుగుతుంది.

Tulsi Water : ఒక్క గ్లాసు తులసి నీటితో మధుమేహాన్ని అదుపులో ఉంచొచ్చా?

Tulsi Water

Tulsi Water : భారతదేశానికి తులసితో అనుబంధం కొన్ని వేల సంవత్సరాలనాటిది. ఇప్పటికీ చాలా మంది తమ ఇంటి ప్రాంగణాల్లో తులసిని పెంచటానికి ఇష్టపడుతుంటారు. తులసి అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంది. ఆయుర్వేద వైద్యంలో ఇది విశిష్టమైన స్ధానాన్ని సంపాదించింది. అనేక ఆయుర్వేద సమ్మేళనాలలో ఒక అంతర్గత భాగంగా చెప్పవచ్చు. తులసిని అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. తులసి యొక్క యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, అధిక రక్తపోటు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మం మరియు జుట్టు సంరక్షణ దినచర్యలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది బలమైన యాంటీమైక్రోబయల్ చర్య మోటిమలపై పోరాడుతుంది.

అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏటంటే రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. మధుమేహం అనేది మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. పరిస్థితిని రివర్స్ చేయడం కష్టంగా ఉన్నప్పటికీ, తీసుకునే ఆహారం ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు. డైట్‌లో కొన్ని డయాబెటిక్-ఫ్రెండ్లీ మూలికలు, ఆహారాలను చేర్చుకోవడం ఇది సాధ్యపడుతుంది. ఈ మూలికల్లో తులసి ఒకటి . తులసి ఆకుల నీళ్లతో మధుమేహాన్ని సైతం నియంత్రించవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

తులసి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ హెర్బ్ ప్యాంక్రియాటిక్ బీటా-సెల్ ఫంక్షన్, ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు, కండరాల కణాల ద్వారా గ్లూకోజ్ తీసుకోవడం మరింత పెరుగుతుంది. నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, పరిశోధకులు టైప్-2 డయాబెటిస్ తోబాధపడుతున్న 60 మందిపై పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరికి సాధారణ మందులు అందించారు. మిగిలిన వారికి సాధారణ మందులతోపాటు, 90 రోజులు పాటు తులసి నీటిని అందించారు. సాధారణ మందులతో పాటు తులసిని తీసుకునే వారిలో గ్లూకోజ్ నియంత్రణలో గణనీయమైన మెరుగుదలను వారు గమనించారు.

తులసి నీరు తయారు చేయటం ;

కొన్ని తులసి ఆకులను నీటిలో నానబెట్టి, రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం ఖాళీ కడుపుతో తులసి నీటిని త్రాగాలి. అయితే ముందుగా తులసి నీటిని కూడా తయారు చేసుకోవచ్చు దానిని నిల్వ చేయవచ్చు. రోజంతా సేవించవచ్చు. ఓ గ్లాసు నీళ్లలో తులసి ఆకులు కొన్ని వేసి ఉడికించాలి. ఆ తరువాత ఆ నీటిని వడపోసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తులసి నీళ్లు గానీ మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. తులసి ఆకులతో టీ కూడా చేసుకుని తాగినా ఫలితం ఉంటుంది.