కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్.. సక్సెస్ అయితే వ్యాక్సిన్ వచ్చినట్టే..!

  • Published By: sreehari ,Published On : July 28, 2020 / 08:33 PM IST
కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్..  సక్సెస్ అయితే వ్యాక్సిన్ వచ్చినట్టే..!

కరోనా వ్యాక్సిన్ నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ పై హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.



భారత బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ ఇప్పటికే చాలామందికి అందించారు. టీకా తీసుకున్నవారిని పరిశీలనలో ఉంచారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ SUM హాస్పిటల్ ల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ పై హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభమైనట్టు
తెలిపింది.

కరోనా హ్యుమన్ ట్రయల్స్ లో పాల్గొన్నవారికి ఈ వ్యాక్సిన్ అందించారు. ఎవరైతే స్వచ్ఛంధంగా స్ర్కీనింగ్ చేయించుకున్నారో వారందరికి ఈ టీకాను అందించామని డాక్టర్ వెంకట్ రావు తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత వారిని పర్యవేక్షిస్తున్నారు.


వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశంలో 12 ఇనిస్టిట్యూట్‌లను హ్యుమన్ ట్రయల్స్ కోసం ఎంచుకుంది. ఒడిశాలో IMS, SUM హాస్పిటల్ మాత్రమే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసింది.