Covid Vaccinated People : వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ అధిక వైరస్.. మిగతావారికి అంటించగలరు!

కరోనావైరస్ టీకా తీసుకున్నవారిలోనూ అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకూ కరోనా టీకా తీసుకున్నవారి ద్వారా వైరస్ తక్కువ స్థాయిలో ఉంటుందని భావించారు. అలాగే వారినుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందని అనుకున్నారు.

Covid Vaccinated People : వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ అధిక వైరస్.. మిగతావారికి అంటించగలరు!

Covid Vaccinated People Can Carry As Much Virus As Others

Covid Vaccinated People : కరోనావైరస్ టీకా తీసుకున్నవారిలోనూ అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకూ కరోనా టీకా తీసుకున్నవారి ద్వారా వైరస్ తక్కువ స్థాయిలో ఉంటుందని భావించారు. అలాగే వారినుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందని అనుకున్నారు. కానీ, కొత్త డేటా ప్రకారం.. డెల్టావేరియంట్ కేసుల్లో మాత్రం అలా లేదని తేలింది. కరోనా టీకా తీసుకున్నవారిలోనూ అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనంలో గుర్తించారు. డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ పెరిగిపోతున్న క్రమంలో టీకాలు తీసుకున్న వ్యక్తులు ఇంటి లోపల కూడా మాస్క్ ధరించాలని సిఫారసు చేయాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సూచించింది. ఆరోగ్య అధికారులు తాజా పరిశోధన వివరాలను విడుదల చేశారు. ఇందులో డెల్టా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందనే దానిపై అధ్యయనం నిర్వహించారు.

మూడొంతుల మంది పూర్తి టీకా వ్యక్తులే :
భారతదేశంలో మొదటగా గుర్తించిన డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రావిన్స్‌టౌన్‌లో మసాచుసెట్స్ లో విజృంభిస్తోంది. అక్కడ ఇప్పటికే కౌంటీలోని కేప్ కాడ్‌లో అత్యధిక టీకా రేటు నమోదైంది. ఇప్పటివరకు 900కి పైగా డెల్టా కేసులు ఉన్నాయి. అందులో దాదాపు మూడొంతుల మంది పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులే ఉన్నారు. టీకా తీసుకున్నాం కదా మాకు వైరస్ సోకదు.. తమ నుంచి ఇతరులకు రాదులే అన్న నిర్లక్ష్యమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాస్క్ లేకుండానే ఇతరులతో కలిసి విందులు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఫలితంగా వారినుంచి వైరస్ సంక్రమణ పెరిగిపోయే ఛాన్స్ అధికంగా ఉందని అంటున్నారు. మసాచుసెట్స్‌లో మే చివరలో అన్ని కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది.

డెల్టా కేసులు పెరిగిపోవడంతో ఈ వారం ప్రొవిన్స్‌ టౌన్ ప్రతిఒక్కరికీ ఇండోర్ మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రావిన్స్‌టౌన్ ఉత్సవాలకు సంబంధించి 470 కరోనా కేసుల ఆధారంగా పరిశోధక బృందం అధ్యయనం చేసింది. ఇందులో బార్‌లు, రెస్టారెంట్లు, అతిథి గృహాలు, అద్దె గృహాలలో ఇండోర్ అవుట్‌డోర్ హాలిడే ఈవెంట్‌లు ఉన్నాయి. ఈవెంట్లలో పాల్గొన్న కొంతమందికి పరీక్షలు నిర్వహించారు. పూర్తిగా టీకాలు వేసిన వారిలో లేని వారిలో దాదాపు ఒకే స్థాయిలో వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇన్ఫెక్షన్లలో మూడు వంతులు పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులలో ఉన్నాయి. పూర్తిగా టీకాలు వేసిన వారిలో, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు జ్వరం వంటి సాధారణ లక్షణాలతో 80శాతం ఉన్నాయని తేలింది.