కరోనా వ్యాక్సిన్‌తో భవిష్యత్‌లో సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం..!

  • Published By: sreehari ,Published On : December 12, 2020 / 06:43 PM IST
కరోనా వ్యాక్సిన్‌తో భవిష్యత్‌లో సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం..!

Covid Vaccine May Impact On Fertility : కరోనా మహమ్మారి అంతం మొదలైంది.. కరోనా వైరస్ వ్యాక్సిన్లు వచ్చేశాయి.. కొన్నిదేశాల్లో వ్యాక్సినేషన్ కూడా మొదలైంది.. దాదాపు ఏడాదికాలంగా మహమ్మారి భయంతో బతికినవారంతా కరోనా వ్యాక్సిన్ల రాకతో అందరిలో కొత్త జీవితంపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రముఖ డ్రగ్ కంపెనీ ఫైజర్ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. గతవారమే యూకేలో Margaret Keenan అనే 91ఏళ్ల బామ్మ మొట్టమొదటి వ్యక్తిగా ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకుంది.

ఇప్పుడు ముందుగా ఎవరికి వ్యాక్సిన్ అందిస్తారు. అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ రానైతే వచ్చింది.. కానీ, ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే వచ్చే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయోమనన్న భయమే ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా నుంచి బయటపడినా.. భవిష్యత్తులో వ్యాక్సిన్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో ముఖ్యంగా భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యకు దారితీయొచ్చునని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది. సంతోనాత్పత్తిపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాలు దీర్ఘకాలికంగా ఉంటాయని, అనేక అనారోగ్య సమస్యలకు కారణం కావొచ్చుననే అపోహలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేకించి సంతానోత్పత్తిపై అధిక ప్రభావం పడొచ్చునని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ప్రకటించిన సమయంలోనే సురక్షితమా కాదా? అనేదానిపై ఒక విషయాన్ని ప్రస్తావించింది. Covid-19 mRNA వ్యాక్సిన్ అయినా ఫైజర్.. సంతోనాత్పత్తిపై ప్రభావం పడుతుందా? అనేది కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది.

అంటే దీనిర్థం.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో భవిష్యత్‌లో గర్భం దాల్చకుండా అడ్డుకోవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవం ఏదైనా.. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకైనా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నాయి. సాధారణంగా వ్యాక్సిన్లు అనేవి రెండు గ్రూపులుగా విభజిస్తారని యూకేలో గైనకాలిజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ James Nicopoullos చెప్పుకొచ్చారు. ఇన్ యాక్టివ్ వ్యాక్సిన్లు లాంటివి ఫ్లూ వ్యాక్సిన్లు చాలా సురక్షితమని ఆయన అన్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ వ్యాక్సిన్లకు దూరంగా ఉండాలని సూచిస్తామని అంటున్నారు.

ఎందుకంటే.. వ్యాక్సిన్ ప్రభావం చేత తల్లితో పాటు కడుపులోని బేబీపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. లైవ్ వ్యాక్సిన్లలో కొద్దిమొత్తంలో MMR లేదా BCG కలిగిన యాక్టివ్ డిసీజ్ కణాలు ఉంటాయని, అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో వేయించుకోవద్దని సూచిస్తారని చెప్పారు. లేదంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందని, కొన్నిసార్లు తల్లి లేదా బిడ్డకు ప్రాణాంకతంగా మారే అవకాశం ఉందని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ అనేది కొత్త రకమైన mRNA వ్యాక్సిన్.. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని ప్రేరేపించడంలో వేరుగా స్పందిస్తుంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీతో ఉన్నవారిలో సంతోనాత్పత్తికి సురక్షితమేనడానికి కొద్దిమొత్తంలో డేటా ఉందని చెబుతున్నారు. అంతమాత్రానా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అర్థం కాదని జేమ్స్ స్పష్టం చేశారు.