Dark Circles: కళ్ల కింద నల్లని వలయాలు పోవాలంటే..

మగాళ్లలోనూ.. ఆడాళ్లలోనూ కామన్ సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు రావడం. వీటికి చాలా కారణాలు ఉండొచ్చు. స్ట్రెస్, నిద్రలేమి, హార్మోనల్ సమస్యలు, లైఫ్ స్టైల్ లో మార్పులు కారణం కావొచ్చు.

Dark Circles: కళ్ల కింద నల్లని వలయాలు పోవాలంటే..

Dark Circles

Dark Circles : మగాళ్లలోనూ.. ఆడాళ్లలోనూ కామన్ సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు రావడం. వీటికి చాలా కారణాలు ఉండొచ్చు. స్ట్రెస్, నిద్రలేమి, హార్మోనల్ సమస్యలు, లైఫ్ స్టైల్ లో మార్పులు కారణం కావొచ్చు. ఇవేగాక కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా సమస్యలు తీసుకొస్తాయి. వాటి నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఈ చిట్కాలు ఫాలో అవండి.

టమాటాలు:
ఒక టీ స్పూన్ టమాటా జూస్.. నిమ్మరసంతో కలిసి కళ్ల కింద అప్లై చేయండి. పది నిమిషాలు ఉంచుకుని తీసేయండి. ఇలా రెండు సార్లు చేయాలి.

బంగాళదుంప
బంగాళదుంపను గుజ్జుగా చేసుకుని దూది అందులో ముంచి డార్క్ సర్కిల్స్ కవర్ అయ్యేలా ఉంచుకోండి. పది నిమిషాలు అలా ఉంచి చన్నీళ్లతో కడగండి.

కోల్డ్ టీ బ్యాగ్స్
గ్రీన్ టీ బ్యాట్స్ ను వాటర్ లో ముంచి తీసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబరచండి. వాటిని రెగ్యూలర్ గా కళ్ల మీద పెట్టుకుని పది నిమిషాల సేపు ఉంచుకోండి.

బాదం నూనె
విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఒక్క వారంలోనే మంచి ఫలితాలు ఇస్తుంది. కొద్దిపాటి నూనెను రాసుకుని నైట్ అంతా ఉంచి ఉదయం కడిగితే బెటర్.

చల్లని పాలు
దూదిని తీసుకుని చల్లని పాలలో గానీ, ఐస్ వాటర్ లో కానీ ముంచి కంటిపైన, నల్లని వలయాలు ఉన్న ప్రాంతాన్ని తుడవండి.

కమలా రసం
కమలా పండ్ల రసాన్ని కళ్ల కింద భాగంలో రాసుకోండి.

దోసకాయ
ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన చల్లటి దోసకాయ ముక్కలను రోజుకు ఒక పది నిమిషాలు కళ్ల పైన ఉంచుకుంటే బెస్ట్ ఫీలింగ్ వస్తుంది.

పుదీనా ఆకులు
పుదీనా గుజ్జును నల్లటి వలయాలపై రాసి పది నిమిషాలు పాటు ఉంచండి. ప్రతి రోజూ రాత్రి సమయంలో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు.

రోజ్ వాటర్
రోజ్ వాటర్ ను నల్లటి వలయాలపై రాసి పదిహేను నిమిషాలు పాటు ఉంచండి. ప్రతి రోజూ రాత్రి సమయంలో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు.