Deltacron : డెల్టా, ఒమిక్రాన్ కలిస్తే డెల్టాక్రాన్.. ఇదో కొవిడ్ స్ట్రెయిన్.. లక్షణాలేంటి? నిపుణుల మాటల్లోనే..!

కరోనావైరస్ అనేక వేరియంట్లతో విరుచుకుపడుతోంది. కరోనావైరస్ వేర్వేరు వేరియంట్ల రూపంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఆల్ఫా, డెల్టా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లతో విరుచుకుపడుతోంది.

Deltacron : డెల్టా, ఒమిక్రాన్ కలిస్తే డెల్టాక్రాన్.. ఇదో కొవిడ్ స్ట్రెయిన్.. లక్షణాలేంటి? నిపుణుల మాటల్లోనే..!

Deltacron Experts On Covid Strain That Combines Delta And Omicron, Its Symptoms, Infectivity

Deltacron : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ అనేక వేరియంట్లతో విరుచుకుపడుతోంది. కరోనావైరస్ ప్రారంభం నుంచి వేర్వేరు వేరియంట్ల రూపంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఆల్ఫా, డెల్టా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు విజృంభించాయి. కరోనా మొదటి వేవ్ నుంచి మూడో వేవ్ ఇలా అనేక వేరియంట్లతో ప్రపంచ జనాభాను బెంబేలిత్తించాయి. అంతటితో ఆగలేదు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ అన్నింటికంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీని బారినపడి ప్రాణాలు కోల్పోవడం తక్కువగానే ఉన్నప్పటికీ కేసుల తీవ్రత మాత్రం అత్యధిక స్థాయిలో నమోదవుతోంది. ఇప్పటికే పలు కరోనా స్ట్రెయిన్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇటీవల యూకేలో డెల్టాక్రాన్ (Deltacron) అనే వేరియంట్ పుట్టుకొచ్చింది.

ఇదో రకమైన కొవిడ్ స్ట్రెయిన్ జాతికి చెందినదిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కలిస్తే ఈ డెల్టాక్రాన్ పుట్టుకొచ్చిందని భావిస్తున్నారు. ప్రారంభంలో దీనిపై పరిశోధన జరిపినప్పుడు అదేదో ల్యాబ్ లో జరిగిన తప్పిందమని భావించారు. కానీ, డెల్టాక్రాన్ అనేది కొత్త కొవిడ్ స్ట్రెయిన్ అని.. అది ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ల హైబ్రిడ్ జాతికి చెందినదిగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వేరియంట్ కు సంబంధించి మొదటి కేసులు యూకేలో నమోదయ్యాయి. అయితే ఈ కేసులు తక్కువగానే ఉండటంతో పెద్దగా ఆందోళన అక్కర్లేదని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ డెల్టాక్రాన్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి.. వ్యాప్తి ఎలా ఉంటుంది అనేదానిపై నిపుణులు కొన్ని విషయాలను ప్రస్తావించారు.

Read Also : Omicron: డెల్టా కంటే ఒమిక్రాన్ డేంజరస్..? స్పెర్మ్‌కౌంట్‌పై ప్రభావం ఎంత?

డెల్టాక్రాన్ అంటే ఏంటి?
యూకేలో డెల్టాక్రాన్ కేసులు తక్కువ మొత్తంలోనే నమోదయ్యాయి. కోవిడ్ జాతికి చెందిన డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒకే వ్యక్తికి వ్యాపించినట్టు గుర్తించారు. రెండు రకాల వేరియంట్లు సోకిన వ్యక్తిలో డెల్టాక్రాన్ అనే వేరియంట్ ఉద్భవించినట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ డెల్టక్రాన్ వేరియంట్ బ్రిటన్‌ నుంచి వచ్చిందా లేదా అక్కడే పుట్టుకొచ్చిందా అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పటివరకూ కరోనా మహమ్మారిలో అనేక ‘రీకాంబినెంట్’ వేరియంట్‌లను కనుగొన్నారు. అయితే ఈ కరోనా వేరియంట్లు తీవ్రమైన వ్యాప్తికి దారితీయలేదని నివేదిక పేర్కొంది.

Deltacron Experts On Covid Strain That Combines Delta And Omicron, Its Symptoms, Infectivity (1)

డెల్టాక్రాన్ ప్రాణాంతకమా? లక్షణాలు ఎలా ఉంటాయి? :
డెల్టాక్రాన్ అనే వేరియంట్ వ్యాప్తి తీవ్రమైనదా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి అనేదానిపై UKHSA అధికారులు అధ్యయనం చేపట్టారు. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్ల పనితీరుపై ఈ డెల్టాక్రాన్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో కూడా తెలియదని నిపుణులు చెబుతున్నారు. యూకేలో డెల్టా, ఒమిక్రాన్ స్ట్రెయిన్లను తట్టుకోగలిగేలా భారీ స్థాయిలో రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని, దాంతో ఎక్కువ ముప్పును ఉండకపోవచ్చునని ప్రొఫెసర్ పాల్ హంటర్ తెలిపారు. ప్రస్తుతానికి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ మాదిరి లక్షణాలనే కలిగి ఉంటాయని అంటున్నారు. అయితే ఈ రెండు వేరియంట్లతో ఉద్భవించిన డెల్టాక్రాన్ ప్రాణాంకతం కాకపోవచ్చునని భావిస్తున్నారు.

డెల్టాక్రాన్‌పై WHO ఏమి చెబుతోందంటే..
గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎవరైనా ఒక వ్యక్తి SARS-CoV-2 వంటి విభిన్న వేరియంట్ల బారిన పడే అవకాశం ఉందని సూచించింది. ఈ మహమ్మారి బారినపడే ప్రజలు ఇన్ఫ్లుఎంజా కోవిడ్-19 వంటి రెండూ వేరియంట్ల బారినపడిన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. గతంలో సైప్రస్ ల్యాబ్‌ (Cyprus lab)లో డెల్టాక్రాన్ అనే హైబ్రిడ్ కోవిడ్-19 మ్యుటేషన్ కారణంగానే ఉద్భవించిందనే వార్తలు వచ్చాయి. అయితే ఇది చాలా మటుకు ల్యాబ్ కాలుష్యం ఫలితంగా ఉద్భవించిన వేరియంట్ కాదని నిపుణులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also :  Coronavirus:ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్.. కనుక్కోవడం చాలా కష్టం.. టెస్ట్‌లో నెగెటివ్ రావచ్చు