Omicron: డెల్టా కంటే ఒమిక్రాన్ డేంజరస్..? స్పెర్మ్‌కౌంట్‌పై ప్రభావం ఎంత?

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది.

Omicron: డెల్టా కంటే ఒమిక్రాన్ డేంజరస్..? స్పెర్మ్‌కౌంట్‌పై ప్రభావం ఎంత?

Omicron

Omicron Covid-19: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశం ఎంతలా ఇబ్బంది పడిందో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు దేశం ఒమిక్రాన్ కారణంగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఒమిక్రాన్ సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా వచ్చిన రెండు అధ్యయనాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. ఒమిక్రాన్ ప్రభావంతో పురుషుల్లో వీర్యకణాల శాతం గణనీయంగా తగ్గుతోందన్నది ఈ అధ్యయనంలో తేలింది. అసలు కణాల్లో చురుకుదనం ఉండట్లేదని, ఫలితంగా సంతానలేమి సమస్యకు కారణం అవుతున్నట్లు కూడా అధ్యయనంలో వెల్లడైంది. మొదట దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన ఒమిక్రాన్.. సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా రెండు అధ్యయనాల్లోనూ స్పష్టం అయ్యింది.

ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఒమిక్రాన్ సోకిన 11,329 మందిని ఇతర వైవిధ్యాలతో సోకిన దాదాపు 200,000 మంది వ్యక్తులతో పోల్చారు. ఈ నివేదిక ప్రకారం, రెండు డోసులు తీసుకున్న తర్వాత, ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ప్రభావం 0 శాతం నుంచి 20 శాతం వరకు ఉందని, బూస్టర్ షాట్ తర్వాత, ప్రభావం 55 శాతం నుంచి 80శాతం వరకు ఉందని గుర్తించారు.

ఓమిక్రాన్ పూర్వపు కరోనా వేరియంట్‌ల కంటే 19శాతం తక్కువ ప్రభావం చూపుతుందని మాత్రం గుర్తించారు. అయితే, కోవిడ్-19 నుంచి కోలుకున్న కొన్ని నెలల తర్వాత కొంతమంది స్పెర్మ్ నాణ్యత బలహీనంగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఒమిక్రాన్ సోకిన తర్వాత కోలుకున్నవారిలో స్పెర్మ్ కౌంట్ దాదాపుగా 37శాతం తక్కువగా ఉందని గుర్తించారు పరిశోధకులు.

ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేవారు మాత్రం.. ఒమిక్రాన్ సోకిన 50 నుంచి 90రోజుల వరకు ప్లాన్ చేసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్పెర్మ్ నాణ్యత పరీక్షించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు. స్పెర్మ్ రికవరీ సమయాన్ని మూడు నెలలు అంచనా వేస్తున్నారు.

Madhya Pradesh : కూతురి కోసం సెల్ ఫోన్ కొని..భాజాభజంత్రీలతో ఊరేగింపు