Anxiety : ఆందోళన, ఒత్తిడికి ఆహారపు అలవాట్లు కారణమా?

తియ్యటి పదార్ధాలు ఆందోళన , వత్తిడిలను అదుపు చేస్తాయనుకుంటారు చాలా మంది. అయితే వాస్తవానికి వీటిని తీసుకునే వారిలో సమస్య మరింత రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Anxiety : ఆందోళన, ఒత్తిడికి ఆహారపు అలవాట్లు కారణమా?

Tenssion

anxiety : ప్రతిఒక్కరు తమ జీవితంలో ఎదో ఒక సమయంలో ఒత్తిడి, ఆందోళనలకు లోనవుతుంటారు. ఇలాంటి పరిస్ధితి ఎందువల్లైన ఎదురుకావచ్చు. కుటుంబపరంగా, వృత్తిపరంగా, స్నేహితుల పరంగా ఒక్కో సందర్భంలో ఆందోళనలు, వత్తిడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇవేవి కాకుండా మనం తీసుకునే ఆహారంతో కూడా కొన్ని సందర్భాల్లో ఆందోళన, వత్తిడి చవిచూడాల్సి వస్తుంది.

చాలా మంది వేళకు భోజనం చేయరు. కొన్ని సందర్భాల్లో అసలు తినటమే మానేస్తారు. తినకపోవటం వల్ల మైపోగ్లైసీమియా ఏర్పడి చికాకు, ఆందోళన, తలతిరగటం వంటివి ఉత్పన్నమౌతాయి. సమయాను కూలంగా భోజనం చేయకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించాలి. కాఫీని తాగే వారేలో ఎక్కువగా ఆందోళన ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే కాఫీ తాగే వారిలో ఈ తరహా పరిస్ధితి ఎదురవుతున్నా చాలా మంది అది కనిపెట్టలేరు.

తియ్యటి పదార్ధాలు ఆందోళన , వత్తిడిలను అదుపు చేస్తాయనుకుంటారు చాలా మంది. అయితే వాస్తవానికి వీటిని తీసుకునే వారిలో సమస్య మరింత రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ లో వాడే ఆడిటిప్స్ ఆందోళన పెరగటానికి కారణమౌతాయి. శరీరంలో నీటి శాతం తగ్గినా ఒత్తిడి, ఆందోళనలు రేకెత్తుతాయి.

ఆందోళన, వత్తిడులు తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

గుమ్మడి గింజలు, అరటిని తరచుగా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండొచ్చు. ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం కూడా ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఫొలేట్‌, విటమిన్‌ బి6, బి12లు ఉండేలా రోజువారీ ఆహారాన్ని తీసుకోవాలి.ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం కూడా ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఫొలేట్‌, విటమిన్‌ బి6, బి12లు ఉండేలా రోజువారీ ఆహారాన్ని ప్లాన్‌ చేసుకోవాలి.