Fenugreek : జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

మహిళలు జుట్టు ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు పాటిస్తారు. మెంతులు సిడార్ వెనిగర్ ప్యాక్ కుదుళ్లలో పేరుకుపోయిన అధిక నూనెలను పీల్చుకుంటుంది. చుండ్రు సమస్యను అరికడుతుంది.

Fenugreek : జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Do you know how beneficial fenugreek is for hair health?

Fenugreek : ఆవకాయ పచ్చళ్ళు, వివిధ రకాల వంటలో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. మెంతులు చూడటానికి పసుపు గోధుమ రంగులలో మంచి సువాసనను కలిగి ఉంటాయి. చేదు రుచిని కలిగి నానబెట్టిన తరువాత జిగురు స్వభావాన్ని కలిగివుండే ఈ మెంతులు ఆరోగ్య పరంగా గొప్ప ప్రయోజనాలను కలిఉన్నాయి. మెంతికూర ఆకుకూరల్లో ప్రసిద్ధి చెందినది. మెంతులలో ఫైబర్, ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.

జుట్టు ఆరోగ్యానికి మెంతులు ;

మహిళలు జుట్టు ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు పాటిస్తారు. మెంతులు సిడార్ వెనిగర్ ప్యాక్ కుదుళ్లలో పేరుకుపోయిన అధిక నూనెలను పీల్చుకుంటుంది. చుండ్రు సమస్యను అరికడుతుంది. మెంతులు మరిగించిన కరివేపాకు రసం ప్యాక్ జుట్టు తెల్లబడే సమస్యను నివారిస్తుంది. అలాగే మెంతులు, గుడ్డులోని పచ్చసొన ప్యాక్ వల్ల కుదుళ్లలో దురద క్రమంగా తగ్గుతుంది. జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది.

మెంతుల పొడి , కొబ్బరి నూనె ప్యాక్ పొడిబారిపోయిన జుట్టుకు తేమనందించటంలో పాటు జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. జుట్టు రాలకుండా కాపడుకోవటమే కాక, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. మెంతులు నానబెట్టి పెరుగు, నిమ్మరసం కలిపి బాగా గ్రైండ్ చేసి తలకు హెయిర్ పాక్ వేసుకోవచ్చు. మంచి పోషణను అందివ్వడమే కాకుండా పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తుంది.