Double Chin : గొంతు క్రింద కొవ్వు అధికంగా ఉంటే జాగ్రత్త పడాల్సిందేనా?

డబల్ చిన్ సమస్యతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఉదయం, సాయంత్రము తప్పకుండా ప్రాణయామం చేయాలి. ముఖ్యంగా గొంతు మరియు మెడకు సంబంధించిన సాధారణ ఎక్సర్సైజులు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది.

Double Chin : గొంతు క్రింద కొవ్వు అధికంగా ఉంటే జాగ్రత్త పడాల్సిందేనా?

Double chin

Double Chin : అధిక బరువు, ఊబకాయం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారిలో కొంతమందికి బరువు పెరిగే టప్పుడు పొట్ట, తొడలు, చేతుల తో పాటు గొంతు కింద కూడా కండ భాగం పెరుగుదల అధికంగా ఉంటుంది. దీనినే డబల్ చిన్ గా పిలుస్తారు. గొంతుకింద బాగంలో వాపులా ఉండి అసహ్యంగా కనిపిస్తుంది. గడ్డం కింది భాగంలో పెరిగే కొవ్వు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

గొంతు కింది భాగంలో కొవ్వు పేరుకోవడం వల్ల గాలి గొట్టం మీద ప్రెజర్ పెరిగిపోతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో ఊపిరి అందక ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళు పడుకున్నప్పుడు గురక ఎక్కువ శబ్దం తో వస్తుంది. గొంతు కింది భాగంలో కొవ్వు అధికంగా పేర్కొని పోయినప్పుడు దీని భారమంతా గొంతులోని గాలి గొట్టాలు మీద ఆధారపడి గొంతులో సరఫరా కష్టం గా మారిపోతుంది. దీంతో గురక శబ్ధం వస్తుంది.

నిద్ర కోసం ఏవైనా మందులు తీసుకుంటూ ఉంటే, నిద్ర మధ్యలో ఆక్సిజన్ అందక ఉలిక్కి పడి లేచే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నిద్ర మాత్రలు తీసుకుని ఉంటారో అలాంటప్పుడు, ఊపిరాడక నిద్ర లేవాల్సి న పరిస్థితుల్లో మందుల ప్రభావం వల్ల ఆ వ్యక్తి నిద్రనుండి లేవలేక పోతాడు. దీనివల్ల ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. అందుకే గడ్డం కింది భాగంలో కొవ్వు పేరుకోవడం మంచిది కాదు.

ఇలాంటి వారు నిద్ర పోయే ముందు ఆల్కహాల్ తీసుకొని పడుకునే అలవాటు కనుక ఉంటే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. డబల్ చిన్ సమస్యతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఉదయం, సాయంత్రము తప్పకుండా ప్రాణయామం చేయాలి. ముఖ్యంగా గొంతు మరియు మెడకు సంబంధించిన సాధారణ ఎక్సర్సైజులు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. కళ్ళు మూసుకుని మెడను కుడివైపు నుండి ఎడమవైపుకు, ముందుకు, వెనకకు ఒక క్రమపద్ధతిలో ఆడిస్తూ సాధన చేయాలి. దీనివల్ల చాలా వరకూ గొంతు కింది భాగంలో పేరుకున్న కొవ్వు క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఉదయం పూట 20 నిమిషాల సేపు మరియు సాయంకాలం కూడా 20 నిమిషాల సేపు వీటిని సాధన చేయడం వల్ల గొంతు కింది కొవ్వు తొలగిపోతుంది.