Sinus Problem : సైనస్ సమస్య బాధిస్తుందా? ఉపశమనం కలిగించే 3 యోగాసనాలు

శ్వాస సమస్యలున్న వాళ్లకూ ఈ ఆసనం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. వెన్నెముకకు విశ్రాంతి అంది ఆరోగ్యంగా మారుతుంది. గర్భాశయం, అండాశయాలకూ మేలు చేస్తుంది. పొట్టలోని భాగాలన్నింటికీ మంచిది. హెర్నియా హైపర్‌ థైరాయిడ్‌ ఉన్నవాళ్లు , సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, గుండె జబ్బులూ, అధికరక్తపోటు ఉన్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు.

Sinus Problem : సైనస్ సమస్య బాధిస్తుందా? ఉపశమనం కలిగించే 3 యోగాసనాలు

Sinus Problem : అనే మందిని వేధిస్తున్న సమస్యల్లో సైనసైటిస్ ఒకటి. సైనస్‌ లైనింగ్‌ కణజాలంలో వాపు కారణంగా ఏర్పడుతుంది. ఈ సైనస్‌లు సాధారణంగా గాలితో నిండినప్పుడు, ద్రవంతో నిండినప్పుడు, సైనసైటిస్‌కు దారితీసే ఇన్‌ఫెక్షన్లకు లోనుకావడం జరుగుతుంది. అలర్జీలు, ఉబ్బసం మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తరచుగా సైనస్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడుతుంటారు. ముక్కు పట్టేయడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, ముఖమంతా నొప్పులూ, తలనొప్పి వంటి సైనస్ లక్షణాలు ఇబ్బంది పెడుతుఉంటాయి. దీని నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని యోగాసనాలు ఎంతగానో తోడ్పడతాయి. అలాంటి యోగాసనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పూర్ణ భుజంగాసనం : బోర్లా పడుకుని ఛాతీ పక్కన రెండు చేతులూ ఉంచాలి. ఇప్పుడు మోకాళ్లను వంచి పాదాల్ని పైకి లేపి తల దగ్గరకు తీసుకురావాలి. తరవాత శ్వాస తీసుకుంటూ మెల్లగా భుజాలను పైకి లేపుతూ సాధ్యమైనంత వరకూ తలను పాదాలకు ఆనించడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంలో ఇరవై నుంచి ముప్ఫై సెకన్లు ఉన్నాక శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రావాలి. ఇలా మూడు నుంచి ఆరుసార్లు చేయాలి.

శ్వాస సమస్యలున్న వాళ్లకూ ఈ ఆసనం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. వెన్నెముకకు విశ్రాంతి అంది ఆరోగ్యంగా మారుతుంది. గర్భాశయం, అండాశయాలకూ మేలు చేస్తుంది. పొట్టలోని భాగాలన్నింటికీ మంచిది. హెర్నియా హైపర్‌ థైరాయిడ్‌ ఉన్నవాళ్లు , సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, గుండె జబ్బులూ, అధికరక్తపోటు ఉన్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు.

విపరీత నౌకాసనం ; బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు చాచి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులూ, కాళ్లూ, తలను సాధ్యమైనంత వరకూ పైకి లేపే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో శరీర బరువంతా పొట్టపై ఉంచాలి. మోకాళ్లు వంచకూడదు. ఈ స్థితిలో ఇరవై నుంచి ముప్ఫై సెకన్లు ఉన్నాక శ్వాస వదులుతూ తలా, కాళ్లూ చేతులూ కింద పెట్టాలి. తరవాత మళ్లీ శ్వాస తీసుకుంటూ ఈ ఆసనం వేయాలి. ఇలా ఆరుసార్లు చేయాల్సి ఉంటుంది. సైనస్‌ సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎలర్జీల్లాంటివి రాకుండా ఉంటాయి. శరీరాన్ని సాగదీయడం వల్ల ఛాతీ భాగం, వూపిరితిత్తులూ దృఢంగా, ఆరోగ్యంగా మారతాయి.

భస్త్రిక ప్రాణాయామం ; కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచి, కొద్దిగా వేగంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా వందసార్లు లేదా మూడు నిమిషాలు చేయాలి. తరవాత వెంటనే లేవకుండా కళ్లు మూసుకుని నిమిషం పాటు విశ్రాంతి తీసుకోవాలి. శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. ఆ
తరవాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు దృఢంగా మారతాయి. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.