Curry Leaves : కరివేపాకు కొలెస్టరాల్ ను తగ్గిస్తుందా..?

ఆహారంలో కరివేపాకును చేర్చడం వలన అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించవచ్చు. గుండె సమస్యల ముప్పునుండి సులభంగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, కరివే

Curry Leaves : కరివేపాకు కొలెస్టరాల్ ను తగ్గిస్తుందా..?

Curry Leaves (1)

Curry Leaves : భారతీయ ఆహారంలో కరివేపాకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. దక్షిణ భారత వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే కరివేపాకు వంటకాల రుచిని మరింతగా పెంచుతాయనటంలో ఎలాంటి సందేహంలేదు. అంతే కాకుండా కరివేపాకును వినియోగించటంవల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరతాయి. వంటగది పదార్ధంగా చెప్పబడే ఈ కర్వేపాకులో అనేక పోషక విలువలు ఇమిడి ఉన్నాయి. అందుకే చాలా మంది తమ ఇంటి పెరట్లో తప్పనిసరిగా కరివేపాకు మొక్కను పెంచుకుంటుంటారు.

కరివేపాకులో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఫైబర్, రాగి, ఇనుము మరియు అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయి వంటి ప్రమాద కారకాలు గుండె ప్రమాదాన్ని జబ్బులకు కారణమౌతున్నాయి. ఈ తరుణంలో ఆహారంలో కరివేపాకును చేర్చడం వలన అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించవచ్చు. గుండె సమస్యల ముప్పునుండి సులభంగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, కరివేపాకు సారం రక్త కొలెస్ట్రాల్ మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే గుణాన్ని కలిగి ఉందని తేలింది.

కరివేపా తినటం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కరివేపాకు పొడిలో ఉండే పీచుపదార్ధం మధుమేహాన్ని నియంత్రించటంలో దోహదపడుతుంది. కంటి సమస్యలు ఉన్నవాళ్లకు, దృష్టిలోపం పెరగకుండా ఉండటానికి ఇది చాలా మంచిది. కాలేయ సమస్యలను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కరివేపాకు పొడిని రోజూ తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

రెగ్యులర్ డైట్ లో కర్వేపాకును చేర్చుకోవడం వల్ల అనీమియాను నివారిస్తుంది. మజ్జిగలో కలుపుకుని కర్వేపాకు రసాన్ని తీసుకోవడం వల్ల కొవ్వు కరగటంతో పాటు, బరువు తగ్గించుకోవచ్చు. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఆకులను మెత్తగా నూరి గడ్డలు, పొక్కులకు పైపూతగా వాడొచ్చు. దీంట్లోని అమైనో ఆమ్లాలు గుండె కండరాలకు మేలు చేస్తాయి.కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.

కరివేపాకు ముద్దను నిత్యం టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా కొలెస్ట్రరాల్ తగ్గటంతోపాటు హానికరమైన ఎల్.డి.ఎల్. కూడా గణనీయంగా తగ్గుతుంది. గర్భిణీ వాంతులు, పైత్యపు వాంతుల నివారణకు కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి.

కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి. కాలిన గాయాలు: చర్మంపైన కాలి బొబ్బలెక్కిన సందర్భాల్లో కరివేపాకు ఆకులను మెత్తగానూరి నెయ్యిని గాని లేదా వెన్నతోగాని కలిపి వాటిపై లేపనంగా పూయాలి. ఇలా చేయటంవల్ల గాయాలు త్వరితగతిన మచ్చలు పడకుండా మానిపోతాయి.