Alcohol : మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా? ఇందులో నిజమెంత?

వాస్తవానికి నిద్ర పట్టటం కోసం మద్యం సేవించటాన్ని అలవాటుగా మార్చుకున్న వారికి నిద్రా సమయాన్ని తగ్గించటమే కాకుండా, చివరకు అది నిద్రలేమికి దారితీస్తుంది.

Alcohol : మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా? ఇందులో నిజమెంత?

Alcohol

Alcohol : మానసిక ఉల్లాసం కోసం, స్నేహితులతో కలసి సరదాగా మద్యం సేవిస్తుంటారు. ఒక రోజు సరదాగా ప్రారంభమై, అతరువాత రోజువారి అలవాటుగా మారిపోతుంది. తొలుత మితంగా తీసుకున్నా నెమ్మదినిమ్మదిగా నియంత్రణ కోల్పోయి అధికమొత్తంలో మద్యం సేవించేస్ధాయికి చేరతారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి.

అల్కాహాల్ ఇతర పదార్ధాలతో పోల్చుకున్నప్పుడు చాలా వేగంగా శరీరంలోకి చేరుతుంది. ఇది నేరుగా జీర్ణాశయం నుంచే రక్తంలో కలిసిపోతుంది. అక్కడి నుండి మెదడు,కాలేయంతోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు చేరుతుంది. మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందని చాలామంది అనుకుంటుంటారు. నిద్రలేమితే బాధపడేవారు నిద్రపట్టేందుకు కొందరు నిద్రమాతలు వేసుకుంటుంటే మరికొందరు మాత్రం మద్యం సేవిస్తుంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలోనే చాలా మంది మద్యం సేవించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి వారు చెప్పే కారణం మద్యం తాగితే రాత్రి హాయిగా నిద్రపోవచ్చని.

అయితే వాస్తవానికి నిద్ర పట్టటం కోసం మద్యం సేవించటాన్ని అలవాటుగా మార్చుకున్న వారికి నిద్రా సమయాన్ని తగ్గించటమే కాకుండా, చివరకు అది నిద్రలేమికి దారితీస్తుంది. ఇదే విషయం పలు అధ్యయనాల్లో బయటపడింది. మద్యం సేవిస్తే నిద్ర పట్టడమన్నది వాస్తమే అయినా అది కొద్దిగంటలు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత వెంటనే మెలకువ వచ్చేస్తుంది. సరిగా నిద్ర పట్టదు. ఇలాంటి దుష్ప్రభావాలు పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

మిచిగాన్‌ విశ్వవిద్యాలయం నిద్రపై మద్యం ప్రభావం అనే విషయంపై 20ఏళ్ల యువతీ యువకులను ఎంచుకొని ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారికి తొలిరోజు మద్యం కలిపిన చల్లటి పానీయాన్ని తాగించారు. మర్నాడు ఆ పానీయంలో వాసన రావటానికి కేవలం కొన్ని చుక్కల మద్యం కలిపారు. ఆతరువాత వారిని పరిశీలించారు. మద్యం తాగిన వెంటనే నిద్ర వారంతా నిద్ర పోయినప్పటికీ కొద్దిసేపటికే మెల్కోవటం, నిద్రపట్టక అటుఇటు మసులుతూ ఉండటం గమనించారు. మద్యం సేవించటం వల్ల ప్రశాంతమైన నిద్ర పట్టటం అటుంచి నిద్ర లేమి పరిస్ధితులు ఎదురవుతాయని ఆ అధ్యయనం ద్వారా తేల్చారు.

మద్యం సేవించటం వల్ల నిద్ర లేమి సంగతి పక్కన పెడితే దానిని సేవించటం వల్ల కాలేయం దెబ్బతింటుంది. చివరకు అది కాలేయ క్యాన్సర్ కు దారితీస్తుంది. మద్యం వల్ల జీర్ణాశయంలో అమ్లాలు పెరిగిపోయి పేగుల్లో అల్సర్లు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. క్రమేపి కిడ్నీజబ్బులకు కారణమవుతుంది. బరువు పెరగటం, అధిక రక్తపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.