Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?

పుసుపు , కారాలు వంటలకు రుచిని ఇవ్వటం కోసం వాడతారు. అవి వంటల రంగును మార్చటంతోపాటు దంతాల రంగు మారేలా చేస్తాయి. ముఖ్యంగా రెస్టారెంట్ ఫుడ్స్ లో వీటిని ఎక్కవ మోతాదులో వాడతారు.

Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?

Acidic Foods Make Teeth Greener (1)

Acidic Foods : తెల్లగా మెరిసే దంతాలు కొన్ని రకాల ఆహారపదార్ధాల కారణంగా పసుపు వర్ణంలోకి మారుతుంటాయి. దీనికి కారణం మనం తీసుకునే కొన్ని ఆహారాల్లో ఆమ్లగుణం ఉండటమే. దంతాల తెల్లదనానికి ఈ ఆహారాలను ఒకరకంగా శత్రువుగా చెప్పవచ్చు. అయితే అలాగని అలాంటి ఆహారాలను తినకుండా ఉండటం కష్టమే. ఏపదార్ధాలను తినటం వల్ల తెల్లటి దంతాలు పసుపు వర్ణంలోకి మారుతాయో అవగాహన కలిగి ఉండటం అవసరం.

బ్లాక్ టీలో టాక్సిన్స్ అధికంగా ఉంటాయి. టీకి రంగునిచ్చే వీటివల్లే దంతాల రంగు మారిపోతుంది. అందుకే బ్లాక్ టీ బదులు గ్రీన్ టీ తాగటం మంచిది. వేడి వేడి టీ తాగటం కూడా దంతాలకు హానికలిగుతుంది. బ్లాక్ కాఫీ రంగులో ముదురుగా ఉండటమే కాకుండా ఆమ్లాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల దంతాల రంగు మారతాయి. శీతల పానీయాల్లో వాడే కృత్రిమ రంగులు దంతాల రంగును పూర్తిగా మర్చేస్తాయి. వీటిలోని సిట్రిక్ ఆమ్లం పంటి ఎనామిల్ మీద ప్రభావం చూపుతుంది. చక్కెర వల్ల కూడా దంతాలు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుంది.

పుసుపు , కారాలు వంటలకు రుచిని ఇవ్వటం కోసం వాడతారు. అవి వంటల రంగును మార్చటంతోపాటు దంతాల రంగు మారేలా చేస్తాయి. ముఖ్యంగా రెస్టారెంట్ ఫుడ్స్ లో వీటిని ఎక్కవ మోతాదులో వాడతారు. దీనికి తోడు ఇటీవలి కాలంలో వీటిల్లో కొన్ని రకాల రసాయనాలను కలిపటం వల్ల దంతాల రంగు మారుతుంది. బీట్ రూట్ లో కలర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని జ్యూస్ లా చేసుకుని తాగటం కంటే తినటం మంచిది. రెడ్ వైన్ తాగే వారిలో కూడా దంతాల రంగు మారతుంది. ఇందులో ఉండే ఆమ్లాలే ఇందుకు కారణం.

స్వీట్స్, క్యాండీ, చూయింగ్ గమ్ ల తయారీలో కృత్రిమ రంగులను అధికంగా ఉపయోగిస్తారు. ఈ రంగులు దంతాలపైన ఉండే ఎనామిల్ పై ప్రభావం చూపుతాయి. వీటిని అసలు తినకపోవటమే మంచిది. సోయాసాస్, ద్రాక్ష, క్రాన్ బెర్రీ వంటి రసాల వల్ల కూడా దంతాలు పసుపచ్చగా మారతాయి. వీటిని రసాలుగా కంటే పండ్లుగా తీసుకోవటం మంచిది.