Egg : ప్రతిరోజు గుడ్డు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందా?

శరీరానికి మేలు చేసే మంచి కొలెస్టరాల్‌ పెంపుకోసం గుడ్డు తీసుకోవటం ఉత్తమమని చెబుతున్నారు.

Egg : ప్రతిరోజు గుడ్డు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందా?

Eggs

Egg : మనిషి ఆరోగ్యానికి కోడి గుడ్డు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే ఎగ్స్‌ని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. గుడ్డును వివిధ రూపాల్లో ఆహారంలో బాగం చేసుకోవచ్చు. ఉడికించి, ఫ్రై చేసుకుని, ఆమ్లెట్ రూపంలో తీసుకుంటారు. గుడ్డు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అనే పరిశోధనల్లో తేలింది.

శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పిల్లల పెరు గుదలకు ఇది ఒక మంచి ఆహారంగా నిపుణులు చెబుతున్నారు. ఒక లార్జ్ బాయిల్డ్ ఎగ్‌లో ఆరు శాతం విటమిన్ ఏ, ఏడు శాతం విటమిన్ బీ5, తొమ్మిది శాతం విటమిన్ బీ12, తొమ్మిది శాతం ఫాస్ఫరస్, పదిహేను శాతం విటమిన్ బీ2, ఇరవై రెండు శాతం సెలీనియం ఉంటాయి. కోడి గుడ్డులో ఆరు గ్రాముల హై క్వాలిటీ ప్రొటీన్‌తో పాటు అనేకమైన పోషకాలు ఉంటాయి. కోడి గుడ్డులో తొమ్మిది రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి.

జ్ఞాపక శక్తి పెంచటంలో కోడి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. కడుపులో బిడ్డ బ్రెయిన్ ఎదుగుదలకు, వృద్దుల్లో జ్ఞాపక శక్తి పెరగటానికి గుడ్డులో ఉండే కొలీన్ అనే పదార్ధం దోహదపడుతుంది. మెడడుకు ఆరోగ్యాన్నిచ్చే కోలిన్‌ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపోయి గుడెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు గర్భిణీ స్ర్తీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.

శరీరానికి మేలు చేసే మంచి కొలెస్టరాల్‌ పెంపుకోసం గుడ్డు తీసుకోవటం ఉత్తమమని చెబుతున్నారు. నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా ఉండి బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. గుడ్డులో ఉండే ప్రొటీన్లు కండరాల బలానికి చక్కగా ఉపకరిస్తాయి. జట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు గుడ్డులో ఉండే సల్ఫర్ మేలు చేస్తుంది. గోళ్ళ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడటంలో గుడ్డులో ఉండే ప్రొటీన్లు సహాయకారిగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.