Sweat : చెమట వాసన వస్తుందా! కొన్ని ఆహారాలే కారణమా?

అలాగే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో అధికంగా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అయ్యి. చెమటకు, దుర్వాసనకు కారణం అవుతుంది. కాబట్టి కాఫీ, టీ, కోక్ వంటి వాటిని మితంగా తీసుకో వడం మంచిది.

Sweat : చెమట వాసన వస్తుందా! కొన్ని ఆహారాలే కారణమా?

Smell Like Sweat

Sweat : ప్రతీ మనిషి శరీరంలో సుమారు రెండు నుంచి నాలుగు మిలియన్ల స్వేద గ్రంథులు ఉంటాయి. ఇవి చర్మం కింద ఉండే డెర్మిస్ పొరలో ఉంటాయి. ఆ గ్రంథుల నుంచే చెమట బయటకు వస్తుంది. ఎండాకాలంలో గాలిలో ఉండే ఎక్కువ వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత ఉండాల్సిన దాని కంటే పెరిగిపోవటంతో దానిని చల్లబరిచేందుకు చెమట ఎక్కువగా వస్తుంది. నిజానికి చెమట రావడం వల్ల నష్టంలేకపోయినప్పటికీ ఇది శరీర ఆరోగ్యానికి మంచిదే అయితే కొన్ని సందర్భాల్లో చెమటతో పాటు వచ్చే దుర్వాసన ఇబ్బందికరంగా మారుతుంది.

సాధారణంగా చెమటలో నీరు, అమోనియా, ఆమ్ల లవణాలు, క్లోరైడ్స్ లాంటివి ఉంటాయి. వీటికి ఎటువంటి దుర్వాసన ఉండదు. కానీ చెమట ఎండిపోయిన తర్వాత శరీరంపై ఉన్నబ్యాక్టీరియాతో ఈ ఆమ్లాలు చేరడం వల్ల చెమట దుర్వాసన వస్తుంది.మనం తీసుకునే ఆహారం వల్ల కూడా చెమట ఇంకా పెరుగుతుంది. మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వీటితోపాటు వెల్లుల్లి , నాన్ వెజ్ తినడం వల్ల చెమటలో దుర్వాసన పెరుగుతుంది. ఎండాకాలంలో వేడిని పెంచే పదార్థాలు, మాంసాహారం తగ్గించటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మసాలా ఆహారం శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను బయటకు రప్పించడానికి కారణమవుతుందని చెబుతున్నారు.

అలాగే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో అధికంగా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అయ్యి. చెమటకు, దుర్వాసనకు కారణం అవుతుంది. కాబట్టి కాఫీ, టీ, కోక్ వంటి వాటిని మితంగా తీసుకో వడం మంచిది. క్యాబేజీ, గోబీ వంటివి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. చెమట, శ్వాస, గ్యాస్ రూపంలో బయటకు వచ్చే సందర్భంలో వాసన ఎక్కువగా ఉంటుంది. పుదీనా ఆకులను నీటిలో కలిపి స్నానం చేస్తే ఆ రోజంతా చర్మం తాజాగా ఉంటుంది. దాంతో చెమట పట్టినా దుర్వాసన రాదు. అలాగే స్నానం చేసిన తర్వాత శరీరానికి ఆస్ట్రింజెంట్ ను రాయాలి. ఆస్ట్రింజెంట్ ను అప్లై చేయడం వల్ల చర్మం మీద ఉన్న అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా నశిస్తుంది.