Lack Of Magnesium : శరీరంలో మెగ్నీషియం లోపిస్తే నిద్రలేమి సమస్య ఎదురవుతుందా?

మెగ్నీషియం లోపం కారణంగా నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారికి కండ‌రాల నొప్పులు , తీవ్ర‌మైన అల‌స‌ట‌, కంగారు, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు ఉంటాయి. అలాగే జ్ఞాప‌క‌శ‌క్తి తగ్గిపోతుంది. నిద్ర‌లేమి వల్లే ఇలా జరుగుతుంది. మెగ్నీషియం లోపం కారణంగానే ఆయా స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. వాటి నుండి బయటపడాలంటే మెగ్నిషియం దోహ‌ద‌ప‌డుతుంది.

Lack Of Magnesium : శరీరంలో మెగ్నీషియం లోపిస్తే నిద్రలేమి సమస్య ఎదురవుతుందా?

Lack Of Magnesium

Lack Of Magnesium : మెగ్నీషియం శాంతపరచడానికి , ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడటం ద్వారా నిద్రను మెరుగుపరుస్తుంది. చాలా మందికి నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటుంది. ప్ర‌స్తుతం అనేక మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతు నిత్యం త‌గినంత నిద్ర పోవ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. నిద్రలేమి సమస్య వల్ల గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, స్థూల‌కాయం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కంటినిండా నిద్ర‌పోయేందుకు జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవ‌డంతోపాటు స‌రైన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకు మెగ్నిషియం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. ఈ పోష‌క ప‌దార్థం గురించి చాలా మంది అంత‌గా ప‌ట్టించుకోరు. కానీ మెగ్నిషియం ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి సులభంగా బయటపడవచ్చు. రోజువారిగా పురుషుల‌కు 400 నుండి 420 మిల్లీగ్రాములు, మ‌హిళ‌లకు 310 నుండి 320 మిల్లీగ్రాములు మెగ్నీషియం అవసరం అవుతుంది.

READ ALSO : Shouldn’t Be Eating Raw : పచ్చిగా తినకూడని 6 ఆహారాలు ఇవే !

మెగ్నీషియం లోపం కారణంగా నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారికి కండ‌రాల నొప్పులు , తీవ్ర‌మైన అల‌స‌ట‌, కంగారు, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు ఉంటాయి. అలాగే జ్ఞాప‌క‌శ‌క్తి తగ్గిపోతుంది. నిద్ర‌లేమి వల్లే ఇలా జరుగుతుంది. మెగ్నీషియం లోపం కారణంగానే ఆయా స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. వాటి నుండి బయటపడాలంటే మెగ్నిషియం దోహ‌ద‌ప‌డుతుంది.

డ‌యాబెటిస్‌, పాంక్రియాటైటిస్‌, హైప‌ర్ థైరాయిడిజం, కిడ్నీ వ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టైన‌ల్ వ్యాధులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్ త‌దిత‌ర వ్యాధులు ఉన్న‌వారిలో స‌హ‌జంగానే మెగ్నిషియం లోపం వ‌స్తుంటుంది. అలాగే ఆల్క‌హాల్‌, సోడా, కాఫీ వంటి డ్రింక్స్‌ను ఎక్కువ‌గా తీసుకున్నా మెగ్నిషియం లోపం కలుగుతుంది. రుతుస్రావం తీవ్రంగా అయ్యే మ‌హిళ‌లు, తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌య్యేవారు, చెమ‌ట బాగా ప‌ట్టేవారిలో మెగ్నిషియం లోపం ఏర్పడుతుంది. ఇలాంటి వారు మెగ్నిషియం లోపం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. నిత్యం తీసుకునే ఆహారంలో మెగ్నిషియం ఉండేలా చూసుకోవాలి. మెగ్నీషియం లోపం ఏర్పడితే నిద్రసరిగా పట్టదు.

READ ALSO : Forgetfulness : మతిమరుపును పోగొట్టే ఆహారాలు ఇవే? వీటిని రోజువారిగా తీసుకుంటే…

అవ‌కాడోలు, అర‌టిపండ్లు, పాల‌కూర‌, జీడిప‌ప్పు, బాదంప‌ప్పు, ఇత‌ర న‌ట్స్‌, బ్రౌన్ రైస్‌, తృణ ధాన్యాలు, విత్త‌నాలు, బీన్స్‌, ప‌ప్పు దినుసులు, ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు, పాలు, పెరుగు, సోయా పిండి, ఇత‌ర సోయా ఉత్ప‌త్తులను తీసుకోవటం ద్వారా మెగ్నీషియం ను పొందవచ్చు. ప్రస్తుతం మెగ్నిషియం స‌ప్లిమెంట్ల రూపంలో కూడా లభిస్తుంది. వాటిని మోతాదుకు మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. వైద్యుల సూచనల మేరకు వాటిని వినియోగించాలి.