Lung Infections: కొవిడ్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఊపిరితిత్తుల్లో న్యూమోనియా

దక్షిణ ముంబై నుంచి ఓ జంటకు వారి 60 ఏళ్ల వయస్సులో గత వారం డాక్టర్ ను కలిశారు. రెండ్రోజులుగా జ్వరం..

Lung Infections: కొవిడ్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఊపిరితిత్తుల్లో న్యూమోనియా

Lung Infections

Lung Infections: దక్షిణ ముంబై నుంచి ఓ జంటకు వారి 60 ఏళ్ల వయస్సులో గత వారం డాక్టర్ ను కలిశారు. రెండ్రోజులుగా జ్వరం వస్తుందని చెప్పడంతో డాక్టర్ స్టెతస్కోపుతో చెక్ చేయగా క్రాకల్స్ సౌండ్ వినిపించింది. ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని న్యూమోనియాగా అనుమానించారు. ఆ రెండు కేసుల్లో కొవిడ్-19 పాజిటివ్ రాగా, సీటీ స్కాన్ లో ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉందని తేల్చారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గతంలో కొవిడ్ కారణంగా కనీసం పది రోజుల తర్వాత గానీ న్యూమోనియా వచ్చేది కాదు. ఇప్పుడు అది మూడు రోజులకే మొదలైపోయింది. ముంబైలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అంత తీవ్రంగా ఉందని నిపుణులు అంటున్నారు.

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రెండు లేదా మూడో రోజే కనిపిస్తుండటం చాలా బాధాకరంగా మారిందని డా. సామ్రాట్ షా అంటున్నారు. షా చెప్పిన దాని ప్రకారం.. వారి ఊపిరితిత్తులు చెడిపోయి ఉండొచ్చు. సీటీ స్కాన్ లో ప్రమాద స్థాయి 7కంటే ఎక్కువగా ఉంది. అంటే వారు ఇన్ఫెక్షన్ లో మైల్డ్ స్టేజ్ కు ఆల్రెడీ చేరిపోయారు.

చాలా మంది పాజిటివ్ వచ్చిన పేషెంట్లలో మార్పులు త్వరగా జరుగుతున్నాయి. ఎక్కువ మందికి ఇంటెన్సివ్ ట్రీట్మెంట్, హాస్పిటలైజేషన్ అవసరం. ఇందులో పాజిటివ్ అంశమేమిటంటే.. ఎక్కువమంది రికవరీ అవుతున్నారు. కేవలం 30శాతం మంది పేషెంట్లలో మాత్రమే రెండు మూడ్రోజుల్లోనే న్యూమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి.