Protein : ప్రొటీన్ల కోసం చికెన్, మటన్ లు తింటున్నారా! తక్కువ ఖర్చుతో ఈ ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది.
పప్పు ధాన్యాలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే పీనట్ బటర్ లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.

Eating chicken and mutton for protein! It is enough to consume these foods at a low cost.
Protein : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ జీవక్రియను పెంచడంతో పాటు అధిక ఆకలిని తగ్గించడంలో సహాయపడుతాయి. మీ ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. రోజువారిగా తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. నిద్రలేమి, సూర్యరశ్మి తగలక పోవడం వల్ల శరీరంలోని ప్రోటీన్‌ల పరిమాణం తగ్గుతుంది. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
ప్రోటీన్ జీవక్రియను పెంచడంతో పాటు అధిక ఆకలిని తగ్గంచడంలో సహాయపడుతుంది. చురుకుగా, బలంగా, ఉత్సాహంగా, చలాకీగా, కండరాలు ధృడంగా ఉండాలంటే మన శరీరానికి ప్రోటీన్లు ఎంతో అవసరం. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్న కూడా మన శరీరానికి ప్రోటీన్లు అవసరత ఉంది. కోడిగుడ్లు, మాంసం వంటి ఆహారాల్లో మాత్రమే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు.
కోడిగుడ్లు, మాంసం కంటే 10 రెట్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఉన్నాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో రాజ్మా ఒకటి. అర కప్పు రాజ్మాలో 9 గ్రాములు ప్రోటీన్లు ఉంటాయి. అలాగే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. పావు కప్పు గుమ్మడి విత్తనాల్లో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మనం శరీరానికి తగినంత ప్రోటీన్లను, ఐరన్ ను అందించిన వాళ్లం అవుతాము. పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ద్రవరూపంలో ఉంటాయి కనుక వీటిని తీసుకోవడం చాలా సులభం. అలాగే పాలల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, క్యాల్షియం, విటమిన్ డి కూడా ఉంటుంది. అలాగే పప్పు ధాన్యాల్లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు పప్పు దినుసుల్లో 18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
పప్పు ధాన్యాలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే పీనట్ బటర్ లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. పన్నీర్, డ్రై ఫ్రూట్స్, క్యాబేజ్, బచ్చలికూర, పుట్టగొడుగులు, అవకాడొ వంటి వాటిని తీసుకున్నా కూడా శరీరానికి తగినంత ప్రోటీన్లు లభిస్తాయి. మిల్లెట్స్ కూడా ప్రోటీన్స్‌కు గొప్ప మూలం. రోజువారి డైట్‌లో ప్రొటీన్‌తో కూడిన సలాడ్‌ను తినడం వల్ల ప్రోటిన్స్‌తో పాటు శరీరానికి కావాల్సిన ఫైబర్స్ అందుతాయి. మెులకెత్తిన విత్తనాలలో కూడా ప్రొటీన్స్ ఉంటాయి.
రోజువారిగా ఒక వ్యక్తికి.. కిలోగ్రాము శరీర బరువుకు ఒక గ్రాము ప్రోటీన్ అవసరమవుతుంది. అయితే ఇది ఆ వ్యక్తి వ్యక్తిగత శరీర అవసరాలకు అనుగుణంగా మారవచ్చు. డైటీషియన్ల ప్రకారం, కిలోగ్రాముకు 1.5 గ్రాములు లేదా 2 గ్రాముల వరకు ఉంటుంది. గర్భం, పాలించే తల్లులకు అధిక ప్రోటీన్ అవసరమౌతుంది. కాబట్టి ప్రొటీన్ కోసం మాంసాహారంపై అధారపడకుండా అందుబాటులో ఉండే, తక్కువ ఖర్చుతో కూడిన ఆహారాలను తీసుకోవటం మంచిది.