Eyesight : మెరుగైన కంటి చూపుకోసం… తీసుకోవాల్సినవి ఏంటంటే!..

నట్స్, పిస్తాచోస్. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్నికాపాడుతాయి. అవకాడో కంటికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న లూటిన్, మాస్కులార్ డిజనరేషన్ రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న మిగతా పోషక పదార్ధాలు కూడా కంటికి చాలా మంచివి.

Eyesight : మెరుగైన కంటి చూపుకోసం… తీసుకోవాల్సినవి ఏంటంటే!..

Eyes

Eyesight : మనిషి ఆరోగ్యంగా జీవించటానికి పోషకాహరం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా శరీరంలోని కొన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే కొన్ని ప్రధానంగా కొన్ని ఆహారాలను తీసుకోవటం చాలా ముఖ్యం. ఆరోగ్యం విషయంలో చాలా మంది అనేక జాగ్రత్తులు పాటిస్తుంటారు. అవి తినాలి. ఇవి తినకూడదన్న నిబంధనలు పెట్టుకుంటుంటారు. ఇలాంటి సమయంలో అసలు ముఖ్యమైన అవయవాలకు కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయి.

ముఖ్యంగా మన శరీరంలోని ముఖ్యమైన అవయవం కన్ను. కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తులు పాటించాల్సిన అవసరం ఉంది.. ఆరోగ్యకరమైన చూపు పొందుకోవాలంటే.. లూటిన్‌, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, బేటాకెరొటిన్‌, ‌ఎ, సి, ఈ విటమిన్లు, జింక్‌.. వంటి పోషకాలు అవసరమౌతాయి. ఇదే విషయాన్ని ఢిల్లీ నూట్రీషియన్ నిపుణులు లోకేంద్ర తోమర్‌ స్పష్టం చేస్తున్నారు..

ముఖ్యంగా కంటి చూపును మెరుగు పరిచే ఆహారాల విషయానికి వస్తే. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఆహారాలు కంటికి ఎంతో ఉపయోగపడతాయి. ఆరెంజ్‌లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకతకు మాత్రమే కాకుండా కంటిలో శుక్లాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా నల్లగుడ్డుపై కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది కళ్లు పొడిబారకుండా ఉండటానికి, గాయాలను మాన్పడానికి, ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడుతుంది.

రాగుల్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే పోలీఫెనాల్స్‌ అధికంగా ఉంటాయని నూట్రీషనిస్ట్‌ శిల్సా ఆరోరా తెలిపారు. యాంటీ క్యాటెర్యాక్ట్‌ స్థాయిలు ఎక్కువ ఉండే పోలీఫెనాల్స్‌ కంట్లో శుక్లాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే రక్తంలో షుగర్‌ స్థాయిలను నియంత్రించి డయాబెటిక్‌ ముప్పు నుంచి కాపాడటంలోనూ వీటి పాత్ర కీలకమైనదే.

ఆహారాల్లో ఉసిరి ఒకటి. ఉసిరి రోగనిరోధకతను పెంచడమేకాకుండా దృష్టిలోపాలను నివారించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. ఉసిరిలోని కెరోటిన్‌ కళ్లను ఆరోగ్యంగా ఉంచి మెరుగైన చూపుకు తోడ్పడుతుంది. క్యారెట్‌ తింటే కంటి ఆరోగ్యానికి మంచిదని పదేపదే చెప్పటం మనం వింటుంటాం. క్యారెట్లలో అధికంగా ఉండే బీటా కెరొటిన్‌ విటమిన్‌ ‘ఎ’గా రూపాంతరం చెందుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారని ఆయుర్వేద నిపుణులు రామ్‌ ఎన్‌ కుమార్‌  సూచిస్తున్నారు.

నట్స్, పిస్తాచోస్. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్నికాపాడుతాయి. అవకాడో కంటికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న లూటిన్, మాస్కులార్ డిజనరేషన్ రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న మిగతా పోషక పదార్ధాలు కూడా కంటికి చాలా మంచివి.

డార్క్ చాక్లెట్స్ లో కోక అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.పచ్చటి ఆకు కూరలేవయినా మంచివే. వీటిల్లో ఉండే లూటిన్, సెల్ డ్యామేజ్ ని అరికడుతుంది. అంతే కాదు వీటితో మస్కులార్ డిజనరేషన్, కాంటరాక్ట్స్ రాకుండా కాపాడుతాయి.