Teeth : మిలిమిల మెరిసే దంతాలకోసం?..

తినే సోడా పళ్ళు తెల్లగా మారటానికి శక్తివంతమైన సహజసిద్దమైన గృహా వైద్యం. ఇది పళ్ళని తెల్లగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మీ దంతాలపై ఆపిల్ సైడర్ వెనిగర్ ని రెండు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి.ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎసిటికామ్లం వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చెడు బాక్టీరియాను చంపేస్తాయి.

Teeth : మిలిమిల మెరిసే దంతాలకోసం?..

Teeth

Teeth : మనిషి శరీరంలో జుట్లు, కళ్లు,ముక్కు తో పాటు పళ్లు కూడా ప్రాధాన్యత కలిగినవే.. దంతాల విషయంలో మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. దంతాలను రోజూ శుభ్రం చేసుకుంటే ఎలాంటి దుర్వాసన లేకుండా ఉంటాయి. నలుగురిలో కలిసి మాట్లాడాలన్న, స్వేచ్ఛగా నవ్వాలన్న మన పళ్ళు అందంగా ఉండాలి. అప్పుడే అందరితో కలిసి ఎంతో కలవిడిగా మాట్లాడగలము. మన పళ్ళ పై గారపట్టి పసుపుపచ్చని మరకలు ఉంటే నలుగురితో కలిసి మాట్లాడటానికి సంకోచిస్తాము. అయితే ఈ విధమైన పసుపుపచ్చని దంతాలతో బాధపడేవారు ఈ క్రింది తెలిపిన చిట్కాలను పాటిస్తే పళ్లలు తళతళ మెరిసిపోతాయి.

సాధారణంగా మనం రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే కొన్ని ఆహార పదార్థాల కారణంగా కూడా మన పళ్ళు పసుపు పచ్చగా మారతాయి. ముఖ్యంగా కాఫీ టీ వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల దంతాలపై పసుపురంగు చారలు ఏర్పడతాయి. ఈ క్రమంలోని ఈ పసుపు చారలు తగ్గిపోవాలంటే చక్కెరతో కూడిన ఆహార పదార్థాలను తగ్గించాలి. పాలు పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవటం వల్ల అందులో ఉన్నటువంటి క్యాల్షియం మన పళ్ళ పై ఏర్పడిన పసుపుపచ్చని మరకలను తొలగిస్తుంది.

ధూమపానం చేసేవారిలో చాలా మందిలో పళ్లపై పసుపుపచ్చని మరకలు ఏర్పడతాయి. ముందు ధూమపానం మానుకోవడం వల్ల ఈ విధమైన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే బేకింగ్ సోడా ఉపయోగించి పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళ పై ఏర్పడిన పసుపు పచ్చని మరకలు తొలగిపోతాయి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని బాగా పుక్కిలించడం వల్ల పళ్ళ పై ఏర్పడిన మరకలు తొలిగిపోవడమే కాకుండా నోటిలో ఏర్పడినటువంటి క్రిములు బ్యాక్టీరియాల నుంచి వచ్చే దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.

రోజు ఉదయం, సాయంత్రం బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఏర్పడిన బ్యాక్టీరియాలు తొలగిపోయి పళ్ళును శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. పుదీనా ఆకులు క్రిమిసంహారకము. పుదీనా ఆకులను నీటితో శుభ్రం చేసుకొని నోట్లో వేసుకొని నమలడం వలన పళ్ళు సమస్యలన్ని, దురువాసన ను కూడా తోలగిస్తుంది. దంతాలకి తెల్ల దనాన్ని పాడు చేయటానికి పట్టి ఉన్న పదార్ధాలని తోలగించే మాలిక్ ఆసిడ్, స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉన్నాయి.

తినే సోడా పళ్ళు తెల్లగా మారటానికి శక్తివంతమైన సహజసిద్దమైన గృహా వైద్యం. ఇది పళ్ళని తెల్లగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మీ దంతాలపై ఆపిల్ సైడర్ వెనిగర్ ని రెండు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి.ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎసిటికామ్లం వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చెడు బాక్టీరియాను చంపేస్తాయి. నిమ్మతొక్కలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి శరీరానికి ఎంత మేలు చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే బ్లీచింగ్ ఏజెంట్లు దంతాలపై ఉన్న మురికి తొలగించడంలో కీలక పాత్ర వహిస్తాయి. నిమ్మతొక్కని దంతాలపై రుద్దాలి. ఆ తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.

ఇలా కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా దంతాల ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవటం తో, పళ్ళను తెల్లగా మిలమిలా మెరిసిపోయేలా ఉంచుకోచ్చు.