ఇదేం తెలివిరా బాబూ.. పెదాలకు హెన్నా పెట్టేసింది

10TV Telugu News

henna LIPS: సోషల్ మీడియాలో ఫేమస్ అవుదామని చేసిందో.. ఆమెకున్న తెలివితేటలు నలుగురితో పంచుకోవాలనుకుందో కాని, ఓ యంగ్ గర్ల్ పెదాలకు లిప్ స్టిక్ బదులు హెన్నా పెట్టేసుకోవచ్చంటూ సొంతగా పెట్టుకుని మరీ చూపించింది. ఆ వీడియోకు ఆమె ఊహించనంత రీతిలో స్పందన వస్తుంది. లక్షల మంది ఆ వీడియోను చూశారు.. మరి మీరు?

అరియా అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేసిన క్లిప్పింగ్.. ఇంటర్నెట్ లో హల్‌చల్ చేస్తుంది. బ్రియానా అనే యువతి రెడ్ హెన్నాను కోన్ నుంచి బయటకు తీసింది. అది బ్రష్ సాయంతో పెదాలపై అప్లై చేసుకుంది. గంటసేపటి తర్వాత దానిని తీసేసి నీటితో క్లీన్ చేసుకుంది. అంతే హెన్నా పండింది.. పెదాల రంగు మారింది.‘హెన్నాతో కొత్తగా ట్రై చేశారా.. హెన్నా పెదవుల గురించి ఏమంటారు. నేను నా పెదాలు సహజంగా ఎర్రగా ఉండాలని రెడ్ హెన్నా వాడాను. లిప్ లైన్ నుంచి మొదలుపెట్టి మొత్తం వేసుకున్నాను. గంటసేపటి తర్వాత క్లీన్ చేసుకున్నా’ అంటూ బ్రియానా పోస్టు చేసింది.

అనేది లాసోనియా ఇనెర్మిస్ అనే మొక్క ఆకులను ఎండబెట్టి తయారుచేస్తారు. దీనిని హెన్నా చెట్టు లేదా మైగ్నోనెట్టె చెట్టు అని పిలుస్తారు.

10TV Telugu News