New HIVconsvX Vaccine : ఫేజ్-1 ట్రయల్స్.. కొత్త HIV వ్యాక్సిన్ మొదటి డోసు అందుకున్నారు!

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు.. కొత్త HIV వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. HIVconsvX టీకా భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేయడమే లక్ష్యంగా ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

New HIVconsvX Vaccine : ఫేజ్-1 ట్రయల్స్.. కొత్త HIV వ్యాక్సిన్ మొదటి డోసు అందుకున్నారు!

Hivconsvx A New Hiv Vaccine Has Reached Its Very First Patients (1)

New HIVconsvX Vaccine : ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు.. కొత్త HIV వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. HIVconsvX టీకా భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేయడమే లక్ష్యంగా ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. HIV-1 వేరియంట్లను లక్ష్యంగా చేసుకుని మొజాయిక్ (mosaic) వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. 18-65 ఏళ్ల వయస్సు గల 13 మంది ఆరోగ్యకరమైన, HIV-నెగటివ్ వ్యక్తులపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

తొలి దశ ట్రయల్స్ లో భాగంగా ఈ కొత్త HIV వ్యాక్సిన్ ముందుగా 13 మంది ఆరోగ్యకరమైన, HIV-నెగటివ్ వాలంటీర్లకు అందించారు. నాలుగు వారాల తర్వాత వీరికి మరో బూస్టర్ షాట్ ఇవ్వనున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఫేజ్-1 క్లినికల్ ట్రయల్‌లో భాగంగా HIVconsvX కొత్త హెచ్ఐవి వ్యాక్సిన్ మొదటి డోసులను వాలంటీర్లకు ఇస్తున్నారు. ఈ మొదటి ట్రయల్స్‌లో టీకా భద్రతతో పాటు దాని దుష్ప్రభావాలను తీసుకున్నవారు ఎంతవరకు తట్టుకోగలరో లేదో పరీక్షిస్తారు.

ఈ హెచ్‌ఐవి వ్యాక్సిన్ సమర్థత 40ఏళ్లు అస్పష్టంగా ఉంది. హెచ్ఐవి-నెగటివ్ వ్యక్తులలో హెచ్ఐవి సోకకుండా నిరోధించడమే ఈ కొత్త టీకా వ్యూహంగా ట్రయల్ నిర్వహిస్తున్నామని ప్రధాన పరిశోధకుడు టోమ్ హాంకే (Tomas Hanke) వెల్లడించారు. చాలా మందిలో HIV వ్యాక్సిన్ అభ్యర్థుల్లో B-కణాల ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను ప్రేరేపించినట్టు గుర్తించారు. HIVconsvX రోగనిరోధక వ్యవస్థ శక్తివంతమైన, వ్యాధికారక నిర్మూలన T- కణాలను ప్రేరేపిస్తుంది. HIVconsvX హెచ్ఐవీ వ్యాక్సిన్.. T- కణాలను ప్రేరేపిస్తుందన్నారు. వైరస్ సోకిన లేదా క్యాన్సర్ కణాలను అంతం చేయగలదని పేర్కొన్నారు. HIV సోకకుండా ఉండేందుకు కండోమ్ వాడకం, యాంటీ-రెట్రోవైరల్ ఔషధాలపై దృష్టిసారిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 2022 నాటికి ఈ ట్రయల్ ఫలితాలను నివేదించాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యూరప్, ఆఫ్రికా, అమెరికాలో కూడా HIV వ్యాక్సిన్ పై ట్రయల్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

60 ఏళ్ల క్రితమే ఎయిడ్స్ విజృంభణ :
60 ఏళ్ల క్రితం.. ఎయిడ్స్ (AIDS) అనే మహమ్మారి వ్యాపించింది. మొదట నెమ్మదిగా మొదలై చాపకింద నీరులా వ్యాపించింది. రోగనిరోధక వ్యవస్థలను దెబ్బతీస్తూ రెండు దశాబ్దాలుగా ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసింది. ఈ వ్యాధికి 1986 వరకు పేరు లేదు.. ఆ తర్వాతే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (Human Immunodeficiency Virus), లేదా HIV అనే పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్లకు పైగా మంది ఇప్పుడు హెచ్ఐవి కలిగి ఉన్నారు. ఇప్పటికీ ఆ సంఖ్య తగ్గడం లేదు. వాస్తవానికి మొదట ఈ హెచ్ఐవి కనుగొన్నప్పటికి ఇప్పటికీ చాలా తగ్గిందనే చెప్పాలి. HIV వ్యాధికి ఇప్పుడు ట్రీట్ మెంట్ చేయొచ్చునని నయం చేయగల పరిస్థితులు ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఔషధంతో హెచ్ఐవీని అడ్డుకోవచ్చు :
వైరస్ బారిన పడిన వారు post-exposure prophylaxis (PEP) ఔషధాన్ని తీసుకోవచ్చు. ఈ మందుతో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ సోకకుండా అడ్డుకోవచ్చు. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తికి యాంటీరెట్రోవైరల్స్ (antiretrovirals) అందించాల్సి ఉంటుంది. వైరస్ శరీరం లోపల వ్యాప్తిచెందకుండా వైరల్ లోడ్ తక్కువగా ఉండేలా చేస్తుంది. బాధిత వ్యక్తులు రోగనిరోధక వ్యవస్థను పెంచే మందులను వాడాల్సి ఉంటుంది. యాంటీరెట్రోవైరల్ థెరపీ (Antiretroviral therapy) ద్వారా గుర్తించలేని హెచ్ఐవి వైరల్ లోడ్ లైంగిక సంక్రమణను (sexual transmission) నిరోధిస్తుందని బలమైన ఆధారాలు ఉన్నాయని హాంకే చెప్పారు. 2020లో ఏడాదికి 5లక్షల కన్నా తక్కువ కొత్త కేసులు ఉన్నాయని పేర్కొంది. ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసే ఈ HIV-1 vaccine అసలైన పరిష్కారమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.