నో లిమిట్ : మల్టీపుల్ Gmails ఒకేసారి వాడొచ్చు!

  • Published By: sreehari ,Published On : January 2, 2020 / 10:07 AM IST
నో లిమిట్ : మల్టీపుల్ Gmails ఒకేసారి వాడొచ్చు!

మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ఎన్ని జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక బ్రౌజర్‌లో ఒక అకౌంట్ లాగిన్ అయ్యాక మరో అకౌంట్ యాడ్ చేశారా? నిజానికి జీమెయిల్ అకౌంట్లు ఎన్నైనా ఉండొచ్చు. అలాగే ఎన్ని అకౌంట్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి లిమిట్ లేదు. కానీ, ఎక్కువ సంఖ్యలో జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటూ పోతే వాటి లాగిన్ వివరాలు గుర్తించుకోవడం కష్టంగా మారుతుంది. ఫలితంగా గూగుల్ అకౌంట్ కోల్పోయే అవకాశం ఉంది.

సాధారణంగా గూగుల్ అకౌంట్ పాస్ వర్డ్ మరిచినా లేదా అకౌంట్ యూజర్ నేమ్ గుర్తు లేకపోయినా రికవరీ ఈమెయిల్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. ఇదివరకే మీకు గూగుల్ అకౌంట్ ఉండి మరో కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అదే అకౌంట్ ఒకే బ్రౌజర్ లో యాడ్ చేస్తారా? అయితే ఇదిగో ప్రాసెస్ ఇలా ఫాలో అవ్వండి.. ఈజీగా ఎన్ని జీమెయిల్ అకౌంట్లు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక అకౌంట్ లాగిన్ అయినా సరే.. మరో అకౌంట్ లోకి Switch అవ్వొచ్చు. ఇలా ఒకదాని నుంచి మరొ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం..

ఇదిగో ప్రాసెస్ :
* PC లేదా Mac సిస్టమ్ లో Google Chrome బ్రౌజర్ ఓపెన్ చేయండి.
* Google Account లో Login అవ్వండి.
* Top-Right కార్నర్‌లో Profile icon పై Tap చేయండి.
* Add Another Account సెలెక్ట్ చేయండి.
* ఇలా ఎన్ని అకౌంట్లు అయినా Add చేసుకోవచ్చు.
* మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి Login చేయొచ్చు.
* ఏ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అందులోకి ఈజీగా Switch అవ్వొచ్చు.

కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే :
* కొత్త అకౌంట్ కోసం Create Account పై Click చేయండి.
* ఇక్కడ మీకో Drop Down ఆప్షన్ కనిపిస్తుంది.
* మీకు ఎలాంటి అకౌంట్ కావాలో Select చేయండి.
* మీ పర్సనల్ వివరాలను ఎంటర్ చేయండి.
* యూజర్ నేమ్, పాస్ వర్డ్ క్రియేట్ చేయండి.
* Next బటన్ పై Click చేయండి.
* మీ Phone Number వెరిఫై చేసుకోవాలి.
* అన్ని జీమెయిల్ అకౌంట్లకు ఒకే Phone నెంబర్ ఇస్తే ఇవ్వొచ్చు.
* I agree అనే ప్రైవసీ, టర్మ్స్ ఆప్షన్ కింద టిక్ మార్క్ చేసి ఉండాలి.
* Create New గూగుల్ అకౌంట్ పై క్లిక్ చేస్తే చాలు.. మీ అకౌంట్ రెడీ అయినట్టే.
* మల్టీపుల్ గూగుల్ అకౌంట్లలో ఒక్కొక్కటిగా Sign in అవ్వండి.
* గూగుల్ పేజీలో Top right cornerలో Profile iconపై Click చేయండి.
* Signed అకౌంట్లన్నీ ఇక్కడే కనిపిస్తాయి.
* ఒక అకౌంట్ నుంచి మరొ అకౌంటుకు ఈజీగా మారిపోవచ్చు.