Copper : శరీరానికి కాపర్ అవసరత ఎంత?

శరీరంలో తగినంత ఇనుము స్థాయి ఉన్నప్పటికీ చాలా మంది వ్యక్తులు రక్తహీనతతో బాధపడుతుంటారు. దీనికి కారణం శరీరం ఐరన్ ను శోషించాలంటే తగినంత రాగి లేకపోవటమే. ఇదే విషయం అధ్యాయనాల్లో సైతం తేలింది.

Copper : శరీరానికి కాపర్ అవసరత ఎంత?

Copper

Copper : రాగి అనేది మన శరీరంలో ఉండే ఒక ఖనిజం. ఇది మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన కీలకమైన పోషకం. పాదరసం, సీసం మరియు ఆర్సెనిక్ వంటి ఇతర భారీ లోహాలు మీ శరీరానికి మంచివి కావు. కానీ పరిమిత పరిమాణంలో వినియోగించినప్పుడు రాగి శరీరానికి అవసరం. రాగిని ఎక్కువగా తీసుకోవడం, చాలా తక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు.

అనేక విధులను నిర్వహించడానికి రాగి అవసరమౌతుంది. ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, రక్తపోటు మరియు హృదయ స్పందన రేటు నియంత్రణ, శోషణ, ప్రోస్టేట్ యొక్క వాపును నివారించేందుకు, ఎముక, బంధన కణజాలం మరియు అవయవాల అభివృద్ధి, నిర్వహణ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాగి శరీరానికి అవసరమౌతుంది.

శరీరానికి రాగిని అందించే ప్రధాన వనరులు;

మానవ శరీరానికి చాలా తక్కువ మొత్తంలో రాగి అవసరమవుతుంది, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా దానిని పొందవచ్చు. శరీరానికి తగినంత రాగిని పొందాలంటే మీ ఆహారంలో రాగి అధికంగా ఉండే వస్తువులను చేర్చుకోవాలి. కాలేయం, షెల్ ఫిష్ వంటి అవయవ మాంసాలలో రాగి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. రాగి అధికంగా ఉండే ఆహార పదార్థాల విషయనికి వస్తే, మీరు శాఖాహారులైతే, బంగాళదుంపలు, బీన్స్, బటానీలు, తృణధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, డార్క్ చాక్లెట్, వేరుశెనగ, వెన్నతోపాటు, రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని సేవించటం ద్వారా రాగిని పొందవచ్చు.

శరీరంలో తగినంత ఇనుము స్థాయి ఉన్నప్పటికీ చాలా మంది వ్యక్తులు రక్తహీనతతో బాధపడుతుంటారు. దీనికి కారణం శరీరం ఐరన్ ను శోషించాలంటే తగినంత రాగి లేకపోవటమే. ఇదే విషయం అధ్యాయనాల్లో సైతం తేలింది. రాగి లోపం ఉంటే రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో మాత్రలు, క్యాప్సూల్స్ రూపంలో లభించే రాగి సప్లిమెంట్లను వైద్యులు సూచిస్తుంటారు.

శరీరంలో కాపర్ లోపిస్తే ; శరీరంలో రాగి లోపిస్తే కొన్ని లక్షణాలు బయటపడతాయి. శరీరం జలదరింపు, తిమ్మిర్లు, అస్ధితరమైన నడక, రక్తహీనత, అలసట, దృష్టి కోల్పోవటం, వంటి లక్షణాలు బయటపడతాయి. ఇలాంటి సందర్భంలో తగిన పరీక్షల ద్వారా లోపాన్ని గుర్తించి వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది. అదే క్రమంలో రాగిని తగినంత మోతాదులోనే తీసుకోవాలి. రాగిని అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల కాలేయ, కిడ్నీ సమస్యలతోపాటు, గ్యాస్, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.