Herbs For Diabetes : సహజ సిద్ధమైన మూలికలతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటం ఎలాగంటే?

ఈ మూలికలు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అలాగే ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడంలో ఎంతగానో తోడ్పడతాయి. సహజ సిద్ధంగా చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

Herbs For Diabetes : సహజ సిద్ధమైన మూలికలతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటం ఎలాగంటే?

Herbs for diabetes

Herbs For Diabetes : డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా వంశపారపర్యంగా, ఒత్తిడి, మానసిక ఇబ్బందులు, టెన్షన్‌కు గురికావడం, చెడు ఆహారం, చెడు జీవనశైలి లేదా అధిక ఒత్తిడి శరీరంలోని కార్టిసాల్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని సృష్టిస్తుంది. అధిక రక్త చక్కెర శరీరాన్ని బలహీనపరుస్తుంది. అలాగే ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది. కిడ్నీలు, కాలేయం, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఆహార నియమాలను మార్చుకోవటంతోపాటు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ తో బాధపడుతున్న వారు వైద్యులు సూచించిన మందులు, ఇన్సులిన్ తీసుకుంటుంటారు. వాటితోపాటుగా రోజువారీ ఆహారంలో కొన్ని మూలికలను చేర్చుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ మూలికలు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అలాగే ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడంలో ఎంతగానో తోడ్పడతాయి. సహజ సిద్ధంగా చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఈ మూలికలను తీసుకునే సమయంలో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్‌లు వంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని రోజువారిగా తీసుకోవాలి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే మూలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. అశ్వగంధ: అశ్వగంధ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరుకు బాగా చేస్తుంది. ఒత్తిడి , అలసటను దూరమౌతాయి. ఈ పొడిని నీటిలో వేసుకొని తాగడం వల్ల రాత్రి నిద్ర బాగా పడుతుంది.

2. అమృత వల్లి తీగ: అమృత వల్లి తీగ మూలికను ఉదయం రసం లేదా టీ రూపంలో తీసుకోవచ్చు. ఈ ఆకు చేదుగా ఉంటుంది కాబట్టి, దీన్ని నమలడం వల్ల సహజంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని అదుపులో ఉంచుతుంది. జీవక్రియను మెరుగుపరచటంతోపాటుగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయం, ప్లీహము పనితీరును మెరుగుపరుస్తుంది. అదనంగా, అలెర్జీలను నిరోధిస్తుంది.

3. ఉసిరికాయ: ఉసిరికాయ కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీని రసాన్ని రోజూ తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది.

4. దాల్చిన చెక్క: దాల్చిన చెక్క లో కొన్ని కీలకమైన పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. దాల్చిన చెక్క పొడిని ఆహారంలో తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంచవచ్చు.

5. వేప: మధుమేహం ఉన్నవారు చాలా మంది చేదు పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ చేదు మూలికలు ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. నిజానికి వేప వంటి మూలికలు చేదు రుచిని కలిగి ఉంటాయి. దానిని నమలకూడదనుకుంటే వేడి నీటిలో ఆకులను వేసి ఉడికించి ఆ కషాయాన్ని తీసుకోవచ్చు.

6. కరివేపాకు: కరివేపాకు ఆకులను నమలడం వల్ల ఆహారం నుండి రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది. అంతేకాకుండా కరివేపాకులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుచటంలో సహాయపడతాయి.

7. నేరేడు గింజలు: నేరేడు గింజల పొడి మధుమేహానికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఇందుకోసం జామూన్ గింజలను బాగా ఎండబెట్టిన తర్వాత మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం గోరువెచ్చని నీటిలో వేసుకొని పరగడుపున తీసుకోవాలి. ఇదేకాకుండా నేరేడు పండ్లను తినడం ద్వారా చక్కెర స్థాయి పెరగకుండా నియంత్రణలో ఉంచవచ్చు.

8. అంజీర్ ఆకులు: మధుమేహాన్ని నియంత్రించడానికి అంజీర్ ఆకులను ఉపయోగిస్తారు. అంజీర్ ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. ఉదయం పరగడుపుతో అంజీర్ ఆకులను నమలి తినవచ్చు లేదా నీటిలో మరిగించి తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

9. మెంతికూర: మధుమేహాన్ని నియంత్రించడానికి మెంతులు, మెంతికూర ఔషధంలా పనిచేస్తాయి. మెంతులు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. దీని కోసం, 1 టీస్పూన్ మెంతి గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం పరగడుపుతో ఈ నీటిని తాగుతూ మెంతిగింజలను తినాలి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.