Calcium : శరీరంలో కాల్షియం లోపిస్తే…ఎలాంటి సమస్యలు వస్తాయంటే?…

కొన్ని రకాల ఆహారాలను అధికంగా తీసుకుంటే శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాఫీ, ఉప్పు అధికమోతాదులో, మాంసం, ధూమపానం, మద్యం తీసుకుంటే కాల్షియం నిల్వలు తగ్గుతాయి.

Calcium : శరీరంలో కాల్షియం లోపిస్తే…ఎలాంటి సమస్యలు వస్తాయంటే?…

Calcium

Calcium : కాల్షియమ్ జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము కాల్షియం. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. కండర సంకోచవ్యాకోచాలకి కాల్షియం అవసరం. ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గితే ఎముకల బలం తగ్గుతుంది. అనేక రకాల నొప్పులకు దారితీస్తుంది.

పిల్లల ఎదుగుదల సక్రమంగా జరగాలంటే కాల్షియం తగినంత పరిమాణంలో తీసుకోవాలి. గర్భవతులకు కాల్షియం టాబ్లెట్స్‌ రూపంలో ఇస్తుంటారు. అందువల్ల మనం తినే ఆహారంలో కాల్షియం బాగా లభించే పదార్థాలు సమకూర్చుకోవాలి. కాల్షియం తక్కువైతే హైబి.పికి వచ్చే అవకాశాలు ఉంటాయి.

సోయాచిక్కుళ్ళు, కొత్తమీర, మెంతిఆకు, బెల్లం, గేదెపాలు, నువ్వులు, పిస్తా, వాల్‌నట్‌, రాగులు, పొట్టుతో కల మినుములు,ఉలవలు, తోటకూర, తమలపాకులు, కారట్‌, కాలీఫ్లవర్‌, కరివేపాకు, పుదీనా, పసుపు, పొన్నగంటికూర, ధనియాలు, జీలకఱ్ఱ, చేపలు, జున్ను, గ్రుడ్లు, చిలకడదుంపలు, ఎండుకొబ్బరి, బాదం వంటి ఆహారాలలో కాల్సియం అధికంగా లభ్యమౌతుంది.

కొన్ని రకాల ఆహారాలను అధికంగా తీసుకుంటే శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాఫీ, ఉప్పు అధికమోతాదులో, మాంసం, ధూమపానం, మద్యం తీసుకుంటే కాల్షియం నిల్వలు తగ్గుతాయి. పీచు పదార్థాలు, జంతుమాంసకృత్తులు వంటివి తీసుకునేవారిలో కాల్షియంను శరీరం గ్రహించే శక్తిని తగ్గిస్తాయి. ఆకుకూరలలో ఉండే అగ్జాలిక్‌ ఆమ్లం శరీరానికి కాల్షియం లభించకుండా అడ్డుకుంటుంది.

కాల్షియం లోపం ఏర్పడితే ఎముకుల బలహీనత, ఆస్టియోఫొరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో దీని లోపం వల్ల జాయింట్ పెయిన్స్, పెద్ద వయస్సు మహిళల్లో కీళ్లనొప్పులు,ఎముకలు, కండరాల నొప్పులకు కాల్షియం లోపమే ముఖ్యకారణంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. 40 ఏళ్ల వయస్సు దాటిన వారు వైద్యుల సూచనల మేర కాల్షియం మాత్రలు తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూడవచ్చు.

క్యాల్షియం మోతాదు వ్యక్తులు, వయసులను బట్టి మారుతుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు పాలు తాగడంతో పాటు, రోజుకి 2 గ్రాముల క్యాల్షియం సప్లిమెంటు అదనంగా తీసుకోవాలి. ప్రి మెనోపాజ్‌ దశలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తయారవదు. కాబట్టి రోజుకి ఒకటిన్నర గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. మెనోపాజ్‌కు చేరుకున్న తర్వాత అవసరాన్నిబట్టి ఒకటిన్నర నుంచి 2 గ్రాముల వరకూ క్యాల్షియం తీసుకోవచ్చు.

రోజుకు కనీసం 1000 నుండి 1300 మి.గ్రా. కాల్షియం తీసుకున్నాప్పుడే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్యాల్షియం ఎంత అవసరమనేది తెలుసుకోవటం కోసం ఎముకల వైద్యుల చేత పరీక్షలు చేయించుకుని, సూచించిన మోతాదు మేరకు తీసుకోవాలి.

కాల్షియం శరీరము గ్రహింఛేందుకు విటమిన్‌ D అవసరము ఉంది. ఇది ఎండలో వ్యాయమము చేయడం ద్వారా వస్తుంది. విటమిన్ D లేకుండా కాల్షియం మాత్రలు అదనంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. కాల్షియం సప్లిమెంట్ లు ఒక్కోసారి కడుపుబ్బరం, వికా రం, మలబద్దకం, విరేచనాలు ఇలా పలు సమస్యలకు దారి తీస్తాయి. ఖాళీ కడుపుతో ఎప్పుడూ కాల్షియం తీసు కోవటం మంచిది కాదు.