IND vs SA : టీమిండియాకు బిగ్‌షాక్.. చివరి టీ20 మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ దూరం..
IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఐదో టీ20 మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్
IND vs SA
IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, బుధవారం లఖ్‌నవూ వేదికగా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. చివరి టీ20 మ్యాచ్ ఈనెల 19న జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నాడు. పేవల ఫామ్‌లో ఉన్న గిల్.. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో ఆఖరి టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకవేళ నాలుగో టీ20 మ్యాచ్ జరిగినా గిల్ ఆడగలిగేవాడు కాదని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
నాలుగో టీ20 మ్యాచ్ నేపథ్యంలో గిల్ గట్టిగా సాధన చేశాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా బంతి బలంగా కాలి బొటనవేలును తాకింది. దీంతో అతను తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యులు పరీక్షించి విశ్రాంతి అవసరమని సూచించడంతో గిల్ దక్షిణాఫ్రికాతో ఆఖరి టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. మ్యాచ్ సమయానికి గిల్ ఫిట్‌గా ఉంటే చివరి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.
గిల్ మెడ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌లకు కూడా దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతను రెండు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. టీ20 సిరీస్ ముంగిట అతడు తిరిగి ఫిట్ నెస్ సాధించాడు. అయితే, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో శుభ్‌మన్ గిల్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. తొలి టీ20 మ్యాచ్‌లో 4, రెండో టీ20లో డకౌట్ అయ్యాడు. మూడో టీ20 మ్యాచ్లో 28 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్‌లలోనూ గిల్ పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో గిల్ ఆటతీరుపై మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
