Lose Weight Easily : బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉంటే ఈ కూరగాయలు తీసుకుంటే బరువు ఈజీగా తగ్గొచ్చు!

కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, కాల్షియంతో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ప్రతి రోజు ఒక కప్పు ఉడకబెట్టిన కూరగాయలను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది

Lose Weight Easily : బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉంటే ఈ కూరగాయలు తీసుకుంటే బరువు ఈజీగా తగ్గొచ్చు!

lose weight easily

Lose Weight Easily : అధిక బరువు సమస్య ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. శరీరంలో అదనపు కొవ్వు ఎన్నో సమస్యలకు కారణమౌతుంది. బరువు తగ్గేదుందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేక మైన ఫుడ్ ను తీసుకుంటుంటారు. నిపుణుల సలహాలు తీసుకుంటారు. అదేక్రమంలో మరికొంత మంది బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేస్తుంది. డైట్ ను ఫాలో అవుతుంటారు. ఈక్రమంలో బరువు తగ్గాలనుకునే వారు రోజు వారి ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను చేర్చుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇవి మీ బరువును వేగంగా తగ్గిస్తాయి. ఇంతకీ బరువు తగ్గాలనుకునే వారు రోజూ తినాల్సిన కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డైటింగ్ చేసేవారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయలను తీసుకోవటం అలవాటుగా మర్చుకోవాలి. ఉదయం పూట కూరగాయలతో చేసిన స్మూతీని తీసుకుంటే త్వరగా బరువు తగ్గడంతో పాటుగా ఆరోగ్యంగా ఉంటారు. ఇందుకోసం క్యారెట్ స్మూతీని, దుంపలు, టొమాటో జ్యూస్ ని కూడా తీసుకోవచ్చు. ఆ కూరగాయల్లో విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

ఇక మధ్యాహ్న భోజనంలో సలాడ్ ను తీసుకోవాలి. క్యారెట్లు, దోసకాయలు, టమోటాలు వంటి వివిధ రకాల కూరగాయలతో సలాడ్లు తయారుచేసి తీసుకుంటూ అన్నం తినటాన్ని తగ్గించాలి. ఉడకబెట్టిన కూరగాయలను తినటం వల్ల బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఇనుము వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బీన్స్ తినడం బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నవారికి మంచిదని సూచిస్తున్నారు. బీన్స్ లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయని, బీన్స్‌లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి లేకుండా చూసుకోవచ్చు.

సాయంత్రం సమయంలో వెజిటబుల్ సూప్ ను తీసుకోవాలి. వివిధ రకరకాల కూరగాయలతో సూప్ లు తయారు చేసుకోవచ్చు. కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, కాల్షియంతో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ప్రతి రోజు ఒక కప్పు ఉడకబెట్టిన కూరగాయలను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటికి ఎలాంటి నూనెలు చేర్చకూడదు. తృణధాన్యాలు కూడా బరువును తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయి. కొర్రలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాలు మాత్రమే కాకుండా బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగపప్పు, వాల్ నట్ లు తీసుకోవడం మంచిది.

వీటికి తోడుగా ప్రతిరోజూ నీళ్లను పుష్కలంగా తాగాలి. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాటం వల్ల వేగంగా బరువు కోల్పాతారు. డీహైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరంలోని వ్యర్ధాలు తొలగిపోతాయి. అవయవాల పనితీరు మెరుగవుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ తేనె వేసి, కాస్త నిమ్మరసం కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవ్వటంతోపాటు, బరువు సులభంగా తగ్గవచ్చు.