After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!

వ్యాయామం తరువాత తక్షణ శక్తి కోసం అరకప్పు ఉడికించిన ఓట్సిని కాని, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పుతో కలిపి తీసుకోవచ్చు. ఒక అరటి పండు, ఒక గ్లాసు పాలు తీసుకోవటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!

After Exercise

After Exercise : బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది రోజువారిగా వ్యాయామాలు చేస్తుంటారు. కఠిన మైన వ్యాయామాల తరువాత చాలా మంది నిస్సత్తువతో ఏపని చేయలేని పరిస్ధితిని ఎదుర్కొంటారు. ఎందుకంటే వ్యాయామ సమయంలో పెద్ద మొత్తంలో కేలరీలు ఖర్చై పోతాయి. కొన్ని రకాల అత్యవసర పోషకాలను శరీరం కోల్పోవటమూ జరుగుతుంది. ఈ క్రమంలో వ్యాయామం తరువాత కోల్పోయిన శక్తి తిరిగి పొందేందుకు ఏంచేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వ్యాయామం తరువాత తక్షణ శక్తి కోసం అరకప్పు ఉడికించిన ఓట్సిని కాని, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పుతో కలిపి తీసుకోవచ్చు. ఒక అరటి పండు, ఒక గ్లాసు పాలు తీసుకోవటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఉడికించిన గుడ్డుని , పొట్టు తీయని తృణ ధాన్యాలతో కలపి తినటం వల్ల రోజుకు కావాల్సిన మాంసకృత్తులు సులభంగా అందుతాయి. మార్కెట్లో తక్కువ కెలొరీలు, ఎక్కువ ప్రొటీన్లతో ఉండే చీజ్ లభిస్తుంది. దీన్ని పండ్ల సలాడ్ లతో కలిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. రెండు ఉడికించిన చిలగడ దుంపలను తినటం