రాత్రుళ్లు తలస్నానం చేసేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

రాత్రుళ్లు తలస్నానం చేసేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

బిజీ జీవితాల్లో ప్రతీ పని సగంసగం చేసి వదిలేస్తున్నాం. ఇక ఉద్యోగాలకు వెళ్లే వాళ్లు అయితే కొన్ని పనులు రాత్రే పూర్తి చేసుకుంటే ఉదయం ఆఫీసుకు త్వరగా వెళ్లొచ్చని ఫీలవుతున్నారు. వీటిలో తలస్నానం కూడా వస్తుంది. ఉదయం తలస్నానం అని తంటాలు ఎందుకు రాత్రే పూర్తయిపోతే లేట్ ఉండదని భావించి చేసేవాళ్లు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. 

* రాత్రి సమయాల్లో తలస్నానం చేసి పడుకొన్నప్పుడు తలగడ, బెడ్‌కు వెంట్రుకలు అంటుకుంటాయి. పొడి జుట్టుకంటే తడిగా ఉన్నప్పుడే ఎక్కువగా జట్టు ఊడిపోతుంది. 

* జుట్టు పూర్తిగా ఆరకుండా పడుకుంటే నిద్రపోయే విధానాన్ని బట్టి జుట్టు మరింత చిక్కుబడే అవకాశం ఉంది. ఫలితంగా మీరనుకున్న సమయం ఇంకా లేట్ అవ్వొచ్చు. 

* తలస్నానం చేసిన వెంటనే చిక్కుతీయకుండా పడుకుంటే ఉదయానికల్లా ఉండచుట్టుకు పోతుంది. 

* పగలు సమయం కంటే రాత్రుళ్లు తలస్నానం చేస్తే జుట్టులో తేమ అలాగే ఉండిపోతుంది. దీంతో చుండ్రు, జుట్టు రాలడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. తడిజుట్టు తేమ కారణంగా ఫంగల్ పెరుగుతుంది.