Chikungunya : చికున్ గున్యా బారిన పడితే కోలుకోవటం కష్టమేనా? త్వరగా కోలుకోవాలంటే!

చికున్ గున్యా వ్యాప్తి చెందే దోమలు పగటిపూట కాటు వేస్తాయి. కాబట్టి దోమల నుండి రక్షణకు తగిన చర్యలను తీసుకోవాలి. ఫుల్ స్లీవ్ వస్త్రాలను ఉపయోగించడం మంచిది ఎందుకంటె చర్మం దోమలను ఆకర్షించకుండా ఆ దుస్తులు కాపాడతాయి.

Chikungunya : చికున్ గున్యా బారిన పడితే కోలుకోవటం కష్టమేనా? త్వరగా కోలుకోవాలంటే!

Chikungunya

Chikungunya : చికున్ గున్యా వ్యాధి ఫ్లావీ వైరస్‌ కారణంగా వస్తుంది. ఒకసారి ఈ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తే చాలు కీళ్లు, కండరాల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే జ్వరం కూడా ఉంటుంది. కొద్దిరోజుల్లో జ్వరం తగ్గిపోయినా కొళ్ల నొప్పులు మనల్ని నెలల తరబడి వేధిస్తుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోయినవారిలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కీళ్లలో వాపు, నొప్పులు నాలుగైదు వారాలు మొదలు కొన్ని నెలల వరకు కొనసాగుతాయి. తీవ్ర అలసటగా ఉంటుంది. స్కిన్‌ రాషెస్‌ కనిపిస్తాయి. ఆకలి తగ్గిపోవడంతోపాటు వాంతి, వికారంగా వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెడ పక్కన లేదా చెవులకు పక్కన లేదా దవడ కింద ఉండే శోషరస గ్రంధుల్లో వాపు కనిపించిందంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి ;

చికున్ గున్యాతో బాధపడుతున్నప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు తాగలేకపోతే.. సూప్స్, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. భోజనానికి కూడా లిక్విడ్స్ తీసుకోవడం మంచిది. వేడి ఆహారపదార్ధాలు మాత్రమే తీసుకోవాలి. చల్లని పదార్ధాలు తీసుకోరాదు. జ్వరం ఉంటే పుల్లటి పదార్థాలు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి వద్దు. చికున్ గున్యాతో బాధపడేవాళ్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. పాలకూర, మెంతి వంటి ఆకుకూరలను డైట్ లో చేర్చుకోవడం వల్ల చికున్ గున్యాని వేగంగా నయం చేయవచ్చు. విటమిన్ సి ఉండే ఆహారాలైన జామ, కివి, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీ పెంచుతాయి. చికున్ గున్యాతో పోరాడతాయి.

చికున్ గున్యా రాకుండా ;

చికున్ గున్యా వ్యాప్తి చెందే దోమలు పగటిపూట కాటు వేస్తాయి. కాబట్టి దోమల నుండి రక్షణకు తగిన చర్యలను తీసుకోవాలి. ఫుల్ స్లీవ్ వస్త్రాలను ఉపయోగించడం మంచిది ఎందుకంటె చర్మం దోమలను ఆకర్షించకుండా ఆ దుస్తులు కాపాడతాయి. ఇంటి లోపలికి దోమలు రాకుండా ఉండేందుకు తలుపు మరియు కిడికి తెరలు ఉపయోగించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు ఒకే చోట నిలువుగా ఉండే ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి.

చికున్ గున్యా నుండి కోలుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు ;

1.చికున్ గున్యాను త‌గ్గించ‌డంలో ప‌సుపు బాగా ప‌నిచేస్తుంది. అందుకు గాను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం తాగాలి. దీంతో వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

2. చికున్ గున్యా వ‌చ్చిన వారికి కీళ్ల నొప్పులు, వాపులు ఉంటాయి క‌నుక వారు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట రాయాలి. అలాగే ల‌వంగం నూనెను కూడా రాస్తుండాలి. దీంతో నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3.తుల‌సి ఆకులను నీళ్ల‌లో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను పూట‌కు ఒక క‌ప్పు చొప్పున 3 పూట‌లా తాగాలి. వ్యాధి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. చికున్ గున్యా వ‌చ్చిన వారు డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంటారు. క‌నుక కొబ్బ‌రినీళ్ల‌ను తాగుతుండాలి. దీంతో శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యం అవ‌డంతోపాటు త్వ‌ర‌గా కోలుకుంటారు.

5. వేపాకుల‌ను పేస్ట్‌లా చేసి శ‌రీరంపై మ‌ర్ద‌నా చేసిన‌ట్లు మొత్తం రాయాలి. త‌రువాత కొంత సేపు ఉండి స్నానం చేయాలి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ త్వ‌ర‌గా త‌గ్గుతుంది. వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

6.వేడి నీళ్ల‌ను బ‌కెట్ లో తీసుకుని అందులో కొద్దిగా ఎప్స‌మ్ సాల్ట్ వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీళ్ల‌తో స్నానం చేయాలి. దీని వ‌ల్ల రిలీఫ్ వ‌స్తుంది. రోగ నిరోధ శ‌క్తి పెరుగుతుంది. నొప్పులు, వాపులు త‌గ్గుతాయి.

7.పొద్దు తిరుగుడు విత్త‌నాలు, క్యారెట్ల‌ను తింటుండం వ‌ల్ల చికున్ గున్యా నుంచి వ‌చ్చే ల‌క్ష‌ణాలు త‌గ్గుతాయి. త్వ‌ర‌గా కోలుకునే అవ‌కాశం ఉంటుంది.