Pregnant Women : గర్భిణీ స్త్రీలు చేపలు తినటం మంచిదా?

గర్భిణీ స్త్రీలకు చేపలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై అనేక మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చేపల్లో పాదరం వల్ల శిశువులకు హానికలిగే అవకాశాలు ఉంటాయి.

Pregnant Women : గర్భిణీ స్త్రీలు చేపలు తినటం మంచిదా?

Fish

Pregnant Women : గర్భస్ధ పిండం తల్లి నుండే పోషకాహారాన్ని గ్రహిస్తుంది. గర్భిణీ తీసుకునే ఆహారం పైనే పిండం ఆరోగ్యకరమైన ఎదుగుదల అన్నది ఆధారపడి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ప్రోటీన్, విటమిన్, సరైన పోషకాహారం తీసుకోవటం అవసరం. పోషకాలు లభించే ఆహారాల్లో చేపలు కూడా ఒకటి. గర్భవతిగా ఉన్నప్పుడు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్లు,ఖనిజాలతో పోషకాలు అధికంగా ఉన్న చేపలను తీసుకోవచ్చు. మోతాదుకు మించకుండా వైద్యుల సలహాలను పాటిస్తూ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపలను తినటం వల్ల పిండం పెరుగుదల బాగా ఉంటుంది. సాల్మన్ వంటి చేపలలో ఒమేగా -3 ప్యాటీ యాసిడ్స్ లను పుష్కలంగా అందిస్తాయి, ఇవి శిశువు మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి దోహదపడతాయి. మెదడు అభివృద్ధిలో కొవ్వు శాతం చేపలలో ఎక్కువగా ఉంటుంది.

అయితే గర్భిణీ స్త్రీలకు చేపలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై అనేక మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చేపల్లో పాదరం వల్ల శిశువులకు హానికలిగే అవకాశాలు ఉంటాయి. అయితే మరోవైపు చూసుకుంటే చేపలలో తక్కువ కొవ్వు ఉంటుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి విటమిన్ డి, బి 2, కాల్షియం, భాస్వరం , ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం , పొటాషియం వంటి ఖానిజాలు ఉంటాయి.. ఇవన్నీ శిశువు ఆరోగ్యాన్ని పెంచుతాయి. శిశువుల మెదడు, రెటీనా అభివృద్ధికి ఈ పోషకాలు తోడ్పడతాయి. అదే సమయంలో చేపల్లో ఉండే మిథైల్మెర్క్యురీ వల్ల గర్భిణీ స్త్రీ ఆరోగ్యం పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. చేపల్లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, రక్తపోటును తగ్గించడం ద్వారా కొరోనరీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గర్భిణీ స్త్రీలను చేపలను అదేపనిగా తినటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీని వల్ల నెలలు నిండకుండానే డెలవరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. వైద్యులు సూచించిన విధంగా చేపలు 15 రోజులకు ఒకసారి తీసుకోవటం మంచిది. లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది.